Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియా వారియర్... 'బాహుబలి' అనుష్క శెట్టిని బీట్ చేసిందా? షారూక్ సంగతేంటి?

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (18:56 IST)

Widgets Magazine

18 ఏళ్ల మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఇపుడీ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో టాప్ ట్రెండింగ్ అయ్యింది. ఒరు ఆడార్ లవ్ అనే చిత్రంలోని పాటతో కేవలం 26 సెకన్ల వీడియోతో ఇంటర్నెట్టులో కనబడిన ఈ ముద్దుగుమ్మ ఓ స్థాయిలో క్రేజ్ సాధించేసింది.
Priya Warrior


ఈమె ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కత్రినా కైఫ్, విరాట్ కోహ్లి వంటి హేమాహేమీల పాపులారిటీని మించి పోయిందనీ నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడీ కేరళకుట్టి ఎవరు? ఎక్కడ చదివింది అనే వివరాల కోసం నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఈమె విమలా కళాశాలలో బీకాం చదువుతోంది. మోహినీ ఆట్టం, పలు డ్రామాలు, నాటకాల్లో నటించింది కూడా. 
 
'బాహుబలి' అనుష్కనే మించేసింది
ఇకపోతే ఈమె పాపులారిటీ దెబ్బకు బాహుబలి అనుష్క కూడా వెనకబడిపోయిందట. ఏ విషయంలోనో తెలుసా? ఆమెకున్న ఇన్‌స్టాగ్రాం ఫాలోయర్ల విషయంలో. అనుష్క పోస్ట్ చేసిన 465 పోస్టులకు ఆమెకు 2 మిలియన్ల ఫాలోయర్లుంటే ప్రియా వారియర్ పోస్ట్ చేసిన 87 పోస్టులకే 2.3 మిలియన్ల ఫోలోయర్లు వుండటం గమనార్హం. త్రిషకు 15 ఏళ్ల కాలంలో ఆమెకు 1.5 మిలియన్ల ఫాలోయర్లు మాత్రమే వున్నారు. అమలా పాల్ 323 పోస్టులకు ఆమెకున్న ఫాలోయర్ల సంఖ్య 1.2 మిలియన్లు మాత్రమే. మొత్తమ్మీద సోషల్ మీడియాలో ఇంత వేగంగా ఫోలోయర్లను సొంతం చేసుకుని ప్రియా వారియర్ రికార్డునే సృష్టించింది. 
Anushka Shetty
 


షారూక్ ఖాన్‌తో నటించాలనుందట...
వాలెంటెన్స్ డే సందర్భంగా కన్నుగీటి సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను భవిష్యత్తులో ఎవరి సరసన నటించాలో ప్రియా ఆకాశ్ వారియర్ తెలిపింది. తనకు షారూఖ్ ఖాన్‌ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది. అలాగే విలక్షణ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో సినిమా చేయాలని వున్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది. 18 ఏళ్ల ప్రియా ఇంటర్వ్యూలో హిందీలో ఆకట్టుకుంది. 
 
సరళంగా హిందీ మాట్లాడి అదరగొట్టింది. కేరళలో పుట్టినా ముంబైలో పెరిగానని.. హిందీ చదువుకున్నానని ప్రియా ఆకాష్ వారియర్ వెల్లడించింది. అలాగే తాజా ఇంటర్వ్యూలో ప్రియా ఆకాష్‌ తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పేసింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టమని ఈ వాలు కనుల వయ్యారి భామ తెలిపింది. 
Shah Rukh Khan
 
ఇక ''ఒరు ఆదార్ లవ్''లో కన్నుగీటే సన్నివేశం గురించి ప్రియా మాట్లాడుతూ.. కన్ను మీటే ముందు కనుబొమ్మలను పైకెత్తడం దర్శకుడు అడగటంతో అప్పటికప్పుడు చేశానని చెప్పింది. అది ముందుగా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేసింది కాదని ప్రియా క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే.. ప్రియా వారియర్ నటిస్తున్న ఒరు ఆదార్ లవ్ సినిమా మార్చి మూడో తేదీన విడుదల కానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హేట్ స్టోరీ-4 .. 'తుమ్ మేరే హో' వీడియో సాంగ్

'హేట్ స్టోరీస్' సిరీస్‌లో భాగంగా వస్తున్న తాజా చిత్రం "హేట్ స్టోరీ-4". ఈ చిత్రంలోని 'తుమ్ ...

news

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థర్డ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఏది?

టాలీవుడ్‌‌లో సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ...

news

'పవన్ కల్యాణా..? అతడు ఎవరు'...? బాలకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ ...

news

ఆకాష్ వారియర్‌ పాటపై నిషేధం విధించాలట... జిగ్నేష్ మేవానీ మద్దతు

సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియా ఆకాష్ వారియర్.. మరో వివాదంలో చిక్కుకుంది. ''మాణిక్య ...

Widgets Magazine