Widgets Magazine

ప్రియాంకా చోప్రా అంటే పిచ్చ... అందుకే తలుపులు మూసి ఆ పని చేశాడు...

గురువారం, 16 ఆగస్టు 2018 (17:37 IST)

ఈమధ్య బాలీవుడ్... అనేకంటే హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు మరోసారి తళుక్కున మెరిశారు. విషయం ఏంటయా అంటే... ఆమె తొడుక్కున్న రింగు ధర గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలోని జనం మాట్లాడుకుంటున్నారు. ఆమె చేతికి వున్న ఉంగరం ధర అక్షరాలా కోటి రూపాయలు అని చెప్పుకుంటున్నారు. తన కంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్‌ను పెళ్లాడబోతున్న ఈ సుందరి తాజాగా ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా ఏర్పాటు చేసిన విందుకు వచ్చింది. 
Priyanka Chopra
 
వచ్చింది వచ్చినట్లు వుండకుండా తన స్నేహితులు ఎక్కడ కనబడితే అక్కడకెళ్లి ఫోటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫోజుల్లో కూడా తన వేలికి వున్న వుంగరం బాగా ఫోకస్ అయ్యేట్లు చేసింది. దీనితో అంతా ఆ ఉంగరం గురించే అడగడం మొదలుపెట్టారు. ప్రియాంకకు కావాల్సింది కూడా అదే కదా. దాంతో అసలు విషయం చెప్పిందట. అది తన ప్రియుడు, కాబోయే భర్త నిక్ పెట్టిన నిశ్చితార్థ ఉంగరమని వెల్లడించింది. ఆ ఉంగరంలో నాలుగు క్యారెట్ల వజ్రాలున్నట్లు తెలుస్తోంది. 
 
అంతేకాదండోయ్ ఈ ఉంగరాన్ని సెలెక్ట్ చేసేందుకు నిక్... లండన్ లోని ఓ ప్రముఖ వజ్రాల దుకాణంలోకి వెళ్లి, షాపులోకి ఎవర్నీ రానీయకుండా తలుపులు మూసేశాడట. ఎవ్వరూ రాకుండా అతనొక్కడే తీరిగ్గా కూర్చుని తనకు నచ్చిన ఉంగరాన్ని సెలెక్ట్ చేశాడట. ప్రియాంకా చోప్రా అంటే అతడికి ఎంతో ప్రేమ... పిచ్చి అని అది తెలిసిన వారు చెప్పుకుంటున్నారు. కాగా ఆగస్టు 18న బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు ఈ బ్యూటీ సిద్ధమయ్యిందని చెప్పుకుంటున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మెగాస్టార్‌కు పెద్ద చాక్లెట్ పంపిన వై.ఎస్. భారతి.. ఎందుకో తెలుసా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీ ...

news

నటుడు శ్రీహరి భార్యకు జనసేనాని ఆహ్వానం...?

శ్రీహరి. ఈయన గురించి అస్సలు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ...

news

గీత గోవిందంలో ఆ సీన్లు.. క్యూ కడుతున్న అమ్మాయిలు..?

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా అల్లు అరవింద్ సమర్పణలో పరశురాం తెరకెక్కించిన చిత్రం గీత ...

news

చిరు చిత్రం త‌ర్వాత కొర‌టాల చేసే సెన్సేష‌న‌ల్ మూవీ ఇదే..!

మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ ...

Widgets Magazine