బావ కళ్ళల్లో ఆనందం చూసిన భార్య... తీన్‌మార్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు... (వీడియో)

శనివారం, 4 నవంబరు 2017 (09:07 IST)

ఆమె ఒకనాటి హీరోయిన్. ఇపుడు ఓ హీరోకు భార్య. ఇద్దరు కుమార్తెల తల్లి. కానీ, బావ (భర్త) కళ్ళలో ఆనందం చూసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఆమె నిరీక్షణ ఎట్టకేలకు ఫలిచింది. ఫలితంగా బావతో కలిసి తీన్‌మార్ డ్యాన్స్ చేస్తూ, బావ కళ్లలో ఆనందం చూసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. జీవిత. ఆమె భర్త రాజశేఖర్. వారిద్దరే టాలీవుడ్‌లో ఆదర్శ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న జీవిత రాజశేఖర్.
psv garudavega
 
హీరోగా రాజశేఖర్‌కు చాలా రోజుల తర్వాత ఓ మంచి హిట్ వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన చిత్రం "పీఎస్‌వి గరుడవేగ". ఈనెల మూడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో చాలా రోజుల తర్వాత ఓ హిట్ సినిమా వచ్చిందన్న ఆనందం ఇప్పుడు హీరో రాజశేఖర్ కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 
 
అంతేకాదండోయ్... 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం జీవితరాజశేఖర్ ఇంట్లో పండగ వాతావరణం తెచ్చిపెట్టింది. రాజశేఖర్‌తో పాటు ఆయన భార్య జీవిత, కుమార్తెలు ఆనందంగా డ్యాన్స్ చేశారు. రాజశేఖర్ ఇంటి బయట డప్పుల వాయిద్యాలు మిన్నంటుతుండగా, బాల్కనీలో నిలిచిన రాజశేఖర్ తీన్‌మార్ స్టెప్పులు వేశారు. ఆయనతో పాటు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఈ చిత్ర హీరోయిన్లు కూడా పాదం కదిపాడు. కొంతమంది అభిమానులు రాజశేఖర్‌ను పూల మాలలతో సత్కరించారు. రాజశేఖర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''పీఎస్‌వీ గరుడ వేగ'' సినిమా రివ్యూ రిపోర్ట్: రాజశేఖర్ యాక్షన్ అదుర్స్- చిరుతో భేటీ (వీడియో)

నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఆఫీసర్‌ శేఖర్‌(రాజశేఖర్‌)కు తాను చేసే డ్యూటీని ఎంతో ...

news

కమల్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు.. ఇది హిందూ ఉగ్రవాదం కాదా? #justasking

సినీ లెజెండ్ కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో ఉగ్రవాదులు ...

news

మహేష్ - బోయపాటి కాంబినేషన్‌లో '14 రీల్స్ మూవీ' (Video)

మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. 'సరైనోడు', 'జయ జానకి ...

news

స్లిమ్‌గా కనిపించేందుకు ఐష్ ఏం చేస్తుందో తెలుసా? (Video)

నవంబర్ ఒకటో తేదీన 44వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అందాలభామ ఐశ్వర్యారాయ్. ఈ ముదురు భామ ...