శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (19:51 IST)

'పులి'ని పిల్లలు, మహిళలు బాగా ఆదరిస్తున్నారట....

తమిళ నటుడు విజయ్‌ హీరోగా ఫాంటసీ అడ్వెంచర్‌ సినిమా 'పులి' తెలుగు, తమిళ భాషల్లో గతవారం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తమిళంలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదేస్థాయి అంచనాలతో విడుదలైంది. 
 
ఇక భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందిన సినిమా కావడం, విజయ్‌ గత డబ్బింగ్‌ సినిమా తుపాకి, జిల్లా వంటి సినిమాలు తెలుగులోనూ మంచి విజయం సాధించడంతో విజయ్‌ పులికి తెలుగులోనూ మంచి క్రేజ్‌ కనిపించింది. ఈ సినిమా తెలుగు నిర్మాత శోభారాణి.. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ....  రెండో వారమైనా సినిమా మంచి కలెక్షన్స్‌లో దూసుకుపోతోందని, విజయ్‌ కెరీర్లో తెలుగులో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిన సినిమా 'పులి'యే అని ఈ సందర్భంగా ఎస్వీఆర్‌ మీడియా స్పష్టం చేసింది. పులి సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌, పిల్లల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఎస్వీఆర్‌ మీడియా తెలిపింది.