Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మ‌హేష్ కాక‌పోతే ఇంకొక‌రు.. ఆ సినిమా మాత్రం ఆగ‌దు - పూరి..!

సోమవారం, 7 మే 2018 (18:57 IST)

Widgets Magazine

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంట‌గా న‌టించిన మెహ‌బూబా చిత్రం ఈనెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా పై బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉండ‌డం.. దీనికితోడు దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండ‌టంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా విజ‌యం సాధిస్తుంద‌ని టాక్ వినిపిస్తోంది. 
mahesh-janaganamana
 
ఇదిలాఉంటే... ఈ చిత్రం  ప్రమోషన్లో పూరి బిజీగా ఉన్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో తాను మహేష్ బాబు హీరోగా తలపెట్టిన 'జనగణమన' చిత్రాన్ని ప్రస్తావించారు. మహేష్‌తో 'బిజినెస్ మేన్' తీసిన తరువాత 'జనగణమన' ప్లాన్ చేశానని, అయితే, మహేష్ ఏమీ తేల్చలేదని పూరీ చెప్పారు. ఈ సినిమాను మహేష్ కాక‌పోతే... మరో హీరోతో ఈ సినిమాను ఖ‌చ్చితంగా తీస్తానని అన్నారు. 
 
సమాజానికి ఇటువంటి చిత్రం ఎంతో అవసరమని, అత్యాచార ఘటనలు విన్నా, చూసినా తనకెంతో బాధకలుగుతుందన్నారు.  ఈ దేశం ఎలా పోతుందో అర్థం కావడం లేదనిపిస్తుందనీ, భారతావని సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలన్నదే 'జనగణమన' స్టోరీలైన్ అని చెప్పారు. 
 
ఈ మూవీని వెంకీతో పూరి తీయ‌నున్న‌ట్టు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి... జ‌న‌గ‌ణ‌మ‌నలో మ‌హేష్ న‌టిస్తాడా..? వెంకీ న‌టిస్తాడా..? వీరిద్ద‌రూ కాకుండా మ‌రో హీరో న‌టిస్తాడో..? తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హైరిస్క్ తీసుకున్న పూరీ.. ఇంటిని విక్రయించి సినిమా తీశాడట...

టాలీవుడ్‌లోని మాస్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన చిత్రమంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. ...

news

తగ్గని ప్రేక్షకుల సందడి.. లాభాల పంట పండిస్తున్న "రంగస్థలం"

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం మార్చి 30వ ...

news

క్యాస్టింగ్ కౌచ్‌పై ఘాటు సమంత.. పెళ్ళైంది.. పిల్లలు పుట్టినా నటిస్తూనే వుంటా..

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి క్యాస్టింగ్ ...

news

రోజా గారూ... మీరు ఎవరికీ నచ్చలేదేమో?... శ్రీరెడ్డి దారుణమైన కామెంట్

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పలువురిపై కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ...

Widgets Magazine