గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:16 IST)

సెన్సార్ బోర్డుపై పీపుల్ స్టార్ ఫైర్... ఎందుకో తెలుసా?

పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం "అన్న‌దాత సుఖీభ‌వ"‌. త్వ‌ర‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా విష‌యంలో సెన్సార్ అధికారుల వ్య‌క్తం చేసిన తీరుపై

పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం "అన్న‌దాత సుఖీభ‌వ"‌. త్వ‌ర‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా విష‌యంలో సెన్సార్ అధికారుల వ్య‌క్తం చేసిన తీరుపై ఆర్‌.నారాయణ మూర్తి మండిపడ్డారు.
 
నిజానికి రైతులు, సమాజంలో పీడిత వర్గాల సమస్యలే ప్రధానాంశాలుగా ఆయన సినిమాలు తీస్తారన్న విషయం తెలిసిందే. అయితే... ఈ సినిమాని సెన్సార్ కోసం పంపగా, అందులోని కొన్ని సీన్లకు సెన్సార్ కట్స్ చెప్పింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు కానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు అనే డైలాగుతో కూడిన సీనుని తొల‌గించాల‌ని చెప్పడంతో నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
తాను రైతుల సమస్యలే ఇతివృత్తంగా ఈ సినిమా తీశానని, సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన సీన్లను తొలగించమని సెన్సార్ వారు అంటున్నారని మీడియా మీట్‌లో ఆర్‌.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. తన ప్రజల ఆవేదనను తెలియజెప్పాలని చూడడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. 
 
రైతులు ఏం పాపం చేశారు? పారిశ్రామికవేత్తలు ఏం పుణ్యం చేశారు? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భారత ప్రజలు కోట్లాది రూపాయల పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడానికా? అని ప్రశ్నించారు. తాను సెన్సార్ బోర్డు నిర్ణ‌యంపై పునర్విచారణ క‌మిటీ వద్దకు వెళతానని ప్ర‌క‌టించారు.