గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (13:00 IST)

నిర్మాతగా స్పీడు పెంచిన రానా... యాక్షన్ థ్రిల్లర్‌కు సిద్ధం..

యంగ్ హీరో రానా క్రేజ్‌ను 'బాహుబలి' భారీగా పెంచేసింది. దీంతో ఇప్పుడు రానా నటుడుగానే కాకుండా, నిర్మాతగాను కూడా స్పీడు పెంచాడు. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న రానా త్వరలో పీవీపీ బ్యానర్‌తో కలిసి తెలుగులో ఒక భారీ బడ్జెట్ చిత్రం నిర్మించనున్నారు. ఈ సినిమాను 'బ్లూ ఫిష్' అనే పుస్తకం ఆధారంగా యువ దర్శకుడు సంకల్ప్ తెరకెక్కిస్తున్నారు. 
 
సబ్ మెరైన్‌పై జరిగే దాడి నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో రానా ఒక నావికా అధికారిగా కనిపించనున్నాడట. సముద్రం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఒక రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రానా తమిళంలో నటిస్తున్న 'బెంగుళూరు డేస్' సినిమా పూర్తికాగానే, ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్టు సమాచారం.