శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 27 జులై 2015 (16:37 IST)

రజనీకాంత్‌ పక్కన చాన్స్‌ కొట్టేసిన నటి!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించాలని చాలామంది కోరిక వుంటుంది. ఇప్పుడు ఆ ఛాన్స్‌ను 'లెజెండ్‌' హీరోయిన్‌ ఆధికా ఆప్టే కొట్టేసింది. రంజిత్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'కాళీ' సినిమాకు ఆమెను సంప్రదించినట్లు, అందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. రాధికా ఆప్టే తెలుగు కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల్లో నటించింది.
 
తెలుగులో బాలయ్య సరసన నటించింది. ఆమె ఆ పాత్రకు సరిపోయిందని పలువురు సూచించడంతో అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. సహజంగా రజనీకాంత్‌ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత వుండదనీ, వున్నా... రజనీనే ప్రేక్షకులు చూస్తారని తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో ఆమెకు పెర్‌ఫార్మెన్స్‌ పాత్ర రావడం విశేషం. త్వరలో దీని గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.