గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2016 (20:38 IST)

నగ్న చిత్రాలను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటారు : రాధికా ఆప్టే

తాను నటించిన చిత్రంలోని నగ్న చిత్రాలు విడుదలపై ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే స్పందించారు. ఈమె తాజాగా నటించిన చిత్రం 'పార్చ్ డ్' చిత్రంలోని నగ్న సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. వీటిపై సోషల్ మ

తాను నటించిన చిత్రంలోని నగ్న చిత్రాలు విడుదలపై ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే స్పందించారు. ఈమె తాజాగా నటించిన చిత్రం 'పార్చ్ డ్' చిత్రంలోని నగ్న సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. వీటిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. 
 
అయినప్పటికీ ఆమె ఇప్పటివరకు పెదవి విప్పలేదు. అయితే, ఈ విజువల్స్ మరింత వైరల్‌గా మారడంతో స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ... 'దీనిపై నేనేమీ స్పందించలేను. నిజం చెప్పాలంటే, ఏ చిత్రంలోని నగ్న సన్నివేశాలైనా ఇంటర్నెట్‌లో దొరుకుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాల్లో నటించాలి. కానీ, వీటిని బహిరంగంగా ప్రదర్శించకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఆలోచించడంలో అర్థం లేదు' ఆమె చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈ చిత్రంలో తనిష్టా ఛటర్జీ, సుర్వీన్ చావ్లా, అదితి గుప్తా, ఆదిల్ హుస్సేన్ తదితరులు నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘పార్చ్ డ్’ ఇప్పటివరకు 18 పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం స్వదేశంలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.