Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కళ్లతోనే నటించిన నాగార్జున.. జన్మ ధన్యమైందన్న దర్శకేంద్రుడు

హైదరాబాద్, ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (03:35 IST)

Widgets Magazine
nagarjuna in om namo venkatesaya

ఓం నమో వెంకటేశాయ సినిమా చూడటానికి రెండు కళ్లూ చాలవు అంటున్నారు చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు. శుక్రవారం విడుదలైన ఈ ఆధ్యాత్మిక సినిమా చూసిన ప్రేక్షకులు అలౌకికానందంలో మునిగి తేలుతున్నారని,  ఏ  ఉద్దేశంతో ఈ సినిమానూ తీయాలని నిశ్చయించుకున్నానో, అది ఈరోజు పూర్తిగా నిజమైనందని, జన్మ ధన్యమైనంత అనుభూతి కలుగుతోందని దర్శకేంద్రుడు చెప్పారు.  
 
‘‘నేను ఏం ఆశించి ఈ సినిమా తీశానో, ఈ రోజు అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నా జన్మ ధన్యమైంది. సినిమా విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. అందులో రెండు ఫోన్‌ కాల్స్‌ మరచిపోలేను. ‘ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది. ఇంత అద్భుతమైన సినిమా తీసిన మీ కాళ్లకు నమస్కారం చేస్తున్నా’ అన్నారొకరు. ఇంకొకరు ‘వెండితెరపై తిరుపతి పుణ్య క్షేత్రాన్ని ఆవిష్కరించిన మీకు జన్మంతా ఋణపడి ఉంటాం’ అన్నారు. భగవంతుడి విశ్వరూపం చూడడానికి రెండు కళ్లూ చాలవు. అదే విధంగా ఈ సినిమాలో కళ్లతోనే నటించిన నటన చూడడానికీ రెండు కళ్లూ చాలవు. ఇంత అద్భుతమైన సినిమా తీయడానికి కారణమైన మా నిర్మాత మహేశ్‌రెడ్డి, చిత్రబృందం అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.
 
చిత్ర నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ చిత్రంతో నా జన్మ ధన్యమైంది. దీనికి కారకులైన నాగార్జున, రాఘవేంద్రరావులకు జీవితాంతం రుణపడి ఉంటాను. శుక్రవారం నుంచి బోలెడంత మంది అభినందిస్తున్నారు. ఈ అనుభూతిని మరచిపోలేను. రాఘవేంద్రరావు గారి దర్శకత్వం చూస్తుంటే ఆ స్వామివారితో నేను గడిపినట్టు అనిపిస్తోంది. ఏడు కొండల వెంకన్న సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కళ్లకి కట్టినట్టు చూపించారు. క్లైమాక్స్‌లో నలభై నిమిషాల పాటు నా కళ్లవెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. యువతరం నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కర్ని సినిమా అలరిస్తుంది అన్నారు. 
 
రాఘవేంద్రరావుగారు ఓ టీటీడీ బోర్డు సభ్యునిగా భక్తుల ఇబ్బందులను చూసి, చలించి ఈ సినిమా తీశారనిపించింది. అంత అద్భుతంగా ఉందీ సినిమా. కీరవాణి సంగీతం, భారవి రచన, అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ల నటన.. అన్నీ ఆణిముత్యాలే’’ అన్నారు. ‘‘శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే నాకు ఈ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత ఇంకో మూడు సినిమాలు వచ్చాయి. ఇదంతా స్వామివారి మహిమే. నాగార్జున, రాఘవేంద్రరావులకు నేను పెద్ద ఫ్యాన్‌. వాళ్ల కాంబినేషన్‌లో చేసిన ఈ సినిమా హిట్‌ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రగ్యా జైశ్వాల్‌.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నాగార్జున రాఘవేంద్ర రావు ప్రగ్యా జైశ్వాల్‌ అనుష్క అమల Amala Nagarjuna Anushka Pragya Jaiswal Raghavendra Rao Om Namo Venkatesaya

Loading comments ...

తెలుగు సినిమా

news

విలపించిన అమల.. పొెంగిపోయిన నాగార్జున

నాపై అమల మనస్సులో ఇంత ప్రేమ ఉందనేది ఇంతవరకు తెలీలేదని అక్కినేని నాగార్జున అన్నారు. ...

news

బాహుబలికి తర్వాత జక్కన్న మహాభారతం?: అమీర్, షారూఖ్, సల్మాన్‌లతో పాటు ఆ ఇద్దరు?

బాహుబలి-2 సినిమా రిలీజ్ చేసే దిశగా జక్కన్న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ ...

news

గౌతమిపుత్ర శాతకర్ణి ఎఫెక్ట్.. రూ.10కోట్లు పారితోషికం పెంచేసిన బాలయ్య..

క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ...

news

కోర్టు మెట్లెక్కిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సతీమణి.. ఎందుకు?

"మా" అధ్యక్షుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సతీమణి విజయ చాముండేశ్వరి శనివారం ...

Widgets Magazine