గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (09:02 IST)

రాఘవ లారెన్స్ ధాతృత్వం... అబ్దుల్ కలాం పేరిట రూ.కోటి సాయం

తమిళ, తెలుగు సినీ నటుడు, దర్శక నిర్మాత, నృత్యదర్శకుడైన రాఘవ లారెన్స్ తనలోని ఉదారస్వాభావాన్ని మరోమారు చూపించారు. ఇటీవల హఠాన్మరణం చెందిన భారతరత్న, అణుశాస్త్ర పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరిట పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా ప్రకటించారు. 
 
దీనిపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ తన సొంత నిర్మాణ సంస్థ రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటిస్తున్న రెండు కొత్త ప్రాజెక్టులను వేందర్ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల పేరు... మొట్టశివ.. కెట్టశివ, నాగ. 
 
ఈ రెండు చిత్రాల్లో మొట్టశివ.. కెట్టశివ చిత్రానికి ఇచ్చే రెమ్యునరేషన్‌లో భాగంగా తాను అందుకున్న రూ.కోటిని విరాళంగా ప్రకటించారు. ఈ డబ్బుతో కలాం పేరిట పేదలకు సాయం చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. వంద మంది నిజాయితీ గత యువతీ యువకులను ఎంపిక చేసి తలా లక్ష చొప్పున కేటాయించి, వారి ద్వారా నిజంగా అవసరంలో ఉన్న పేదలను గుర్తించి సాయం అందించేలా ఓ ప్రణాళిక రూపొందించినట్లు లారెన్స్ వెల్లడించారు.