Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2 : అనుష్క-ప్రభాస్ పోస్టర్‌లో తప్పు.. సరిచేసుకున్న జక్కన్న..

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:22 IST)

Widgets Magazine
baahubali 2 movie poster

బాహుబలి-2కు సంబంధించిన ప్రభాస్, అనుష్క పోస్టర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో ఉన్న తప్పును నెటిజన్లు కనిపెట్టేశారు. అనుష్క, ప్రభాస్‌ బాణాలు సంధిస్తూ ఉన్న పోస్టర్‌ను ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో ముందు అనుష్క, వెనుక ప్రభాస్‌ నిల్చుని విల్లు ఎక్కుపెట్టే విధంగా ఉంటుంది. వెనుక నిల్చున్న ప్రభాస్‌ ఎక్కుపెట్టిన బాణాలు ముందున్న అనుష్క విల్లుపై కనిపిస్తాయి. ఈ తప్పును నెటిజన్లు కనిపెట్టేశారు. దీంతో రాజమౌళిపై నెగటివ్ వార్తలు వచ్చేశాయ్. ఆ వార్తలకు చెక్‌ పెట్టే క్రమంలో జక్కన్న ఆ తప్పును సవరించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు. 
 
ఇకపోతే.. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. తొలి పార్ట్ అత్యధిక కలెక్షన్స్ సాధించి పాత రికార్డులను తుడిపేయగా, ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కాక ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటూ అందరికి షాక్ ఇస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం కణల్ కణ్ణన్ ఆధ్వర్యంలో సీజీ వర్క్స్ జరుపుకుంటున్నది. 
 
బాహుబలి చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానుండగా హిందీలో కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్ పై విడుదల చేస్తున్నాడు. కేవలం హిందీలోనే బాహుబలి ది ఎండింగ్ రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక మొత్తంగా బాహుబలి2 రూ. 500 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చైతూతో ఎంగేజ్‌మెంట్ తర్వాత మామగారైన నాగ్‌తో సమంత సినిమా.. ''రాజు గారి గది-2''లో?

ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత.. తన సినీ కెరీర్‌లో హీరోయిన్‌గా మంచి ...

news

మెగా కాంబోలో మూవీ ఇప్పట్లో అసాధ్యం... ఎవరికి వారు బిజీ... టీఎస్సార్ స్టేట్మెంట్ ఉత్తుత్తిదేనా?

మెగా కాంబోలో మూవీ చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి. ...

news

డొనాల్డ్ ట్రంపే నాకు ఆదర్శం, స్ఫూర్తి ఏ విషయంలో తెలుసా?: నాగార్జున

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తితే చాలు.. అందరికీ కోపం ...

news

ప్రతీసారీ మంచి ఆఫర్లు రావు కదా.. వచ్చిన ఆఫర్లను యూజ్ చేసుకోవాల్సిందే: సన్నీ

సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ హాట్ గర్ల్‌గా మారిపోయింది. పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్ ...

Widgets Magazine