Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్‌లో ద్రోణాచార్యులకు కొదవలేదు.. అర్జునులే ముందుకు రావాలి: రాజమౌళి

శనివారం, 13 మే 2017 (18:16 IST)

Widgets Magazine

బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన జక్కన్న రాజమౌళి.. విశాఖలోని యాదవ జగ్గరాజుపేట గ్రీన్‌సిటీలో ఏర్పాటు చేసిన లక్ష్యా బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించారు. శనివారం అకాడమీని చేతుల మీదుగా ప్రారంభించిన రాజమౌళి.. అకాడమీలో శిక్షణకు రెడీ అవుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 
 
మహాభారతంలో చెట్టుపై ఉన్న పక్షిని చూపించి ఏం కనిపిస్తోందని ద్రోణాచార్యులు అడిగితే.. పక్షి కన్ను మాత్రమే తనకు కనిపిస్తోందని అర్జునుడు చెప్పాడని రాజమౌళి చెప్పారు. అర్జునుడి దృష్టి విద్యార్థుల్లో కనిపించినప్పుడే.. లక్ష్యాన్ని చేధించడం సాధ్యమవుతుందని విద్యార్థుల్లో పట్టుదలను నింపే మాటలు మాట్లాడారు. అలాంటి అర్జునులు మనదేశానికి చాలా అవసరమని రాజమౌళి వ్యాఖ్యానించారు. భారత్‌లో ద్రోణాచార్యులకు కొదవలేదని.. అర్జునులు మాత్రం ముందుకు రావాలని రాజమౌళి చెప్పుకొచ్చారు. 
 
ఇంకా రాజమౌళి మాట్లాడుతూ.. విశాఖ పట్నానికి తన మనస్సులో ప్రత్యేక స్థానముందన్నారు. తన అమ్మ పుట్టింది వైజాగ్. తాను నివసిస్తున్నది కూడా ఇక్కడేనని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. బ్యాడ్మింటన్ కోచ్ ఎమ్. వీ. మురళీ కృష్ణ 25 ఏళ్లుగా తనకు తెలుసునని.. ఆయన తన స్నేహితుడని.. ఆయన కోసం.. ఆయనలో బ్యాడ్మింటన్ ఉన్న పట్టుదల కోసం ఇక్కడికి వచ్చానని రాజమౌళి వ్యాఖ్యానించారు. ఏపీలో ఆరంభమైన తొలి బ్యాడ్మింటన్ అకాడమీ అనేకమంది బ్యాడ్మింటన్ క్రీడాకారులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టాలని రాజమౌళి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో రాజమౌళి ఓపిగ్గా పలు సెల్ఫీలు తీసుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్: ఓసేయ్ రాములమ్మ సీక్వెల్ కోసం జిమ్‌లో కసరత్తులు?

లేడీ బాస్, లేడీ అమితాబ్ అని పేరు తెచ్చుకున్న విజయశాంతి తిరిగి సినీ రంగంలో సెకండ్ ...

news

'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం ...

news

చైతూ-సమ్మూ పెళ్లెప్పుడు..? రారండోయ్ వేడుక చూద్దాం.. అని చెప్పేదెప్పుడు.. ఫ్యాన్స్ ప్రశ్న

సమంత, నాగచైతన్య ప్రేమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ...

news

ఇంకా ఎవర్నీ ప్రేమించలేదు.. డేటింగ్ చేయాల్సి వస్తే అతనితోనే?: రకుల్ ప్రీత్ సింగ్

మిస్‌ ఇండియా ఫైనలిస్ట్.. నాలుగు సబ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్ రంగం నుంచి సినీ ...

Widgets Magazine