గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (11:50 IST)

శ్రీదేవికి సారీ చెప్పిన రాజమౌళి.. పబ్లిక్‌గా చెప్పడం తప్పే.. కానీ అబద్ధం చెప్పలేదు..

బాహుబలి సినిమాలో శివగామి పాత్రను అతిలోకసుందరి శ్రీదేవి నిరాకరించిందని.. దర్శక ధీరుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో.. శ్రీదేవి మనస్తాపం చెందిన సంగతి తెలిసిందే. గతంలో ఎందరో డైరక్టర్లు తాను నో చెప్ప

బాహుబలి సినిమాలో శివగామి పాత్రను అతిలోకసుందరి శ్రీదేవి నిరాకరించిందని.. దర్శక ధీరుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో.. శ్రీదేవి మనస్తాపం చెందిన సంగతి తెలిసిందే. గతంలో ఎందరో డైరక్టర్లు తాను నో చెప్పిన రోల్స్ గురించి ఎక్కడా బయటికి చెప్పలేదని.. అయితే రాజమౌళి.. ఇలా పబ్లిక్‌గా తన గురించి ఇలాంటి కామెంట్లు చేయడం అనేది.. కరెక్ట్ కాదని మామ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పుకొచ్చింది. 
 
శివ‌గామి పాత్ర‌కి ముందుగా శ్రీదేవినే సంప్ర‌దించిన‌ప్ప‌టికి తాను ఎక్కువ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో , ప్రాజెక్టులో ర‌మ్య‌కృష్ణ‌ని తీసుకున్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. ఈ కామెంట్లపై శ్రీదేవి కూడా కౌంటరిచ్చింది. శివ‌గామి పాత్ర‌ని చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం తన వ్యక్తిగత కారణాలంటూ.. శ్రీదేవి చెప్పింది. 
 
అంతేకాక రాజమౌళి అంటే తనకెంతో గౌరవమని, ఆయన దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం అద్భుతమని చెప్పిన శ్రీదేవి.... అలాంటి దర్శకుడు తన గురించి అలా మాట్లాడటం పద్దతిగా అనిపించలేదని, మనసుకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తాజాగా జక్క‌న్న‌ స్పందించాడు. రాజమౌళి శ్రీదేవి కామెంట్స్‌పై స్పందించినట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. 
 
"మా ఇద్దరిలో ఎవ‌రి వ‌ర్షెన్ క‌రెక్ట్ మాట్లాడారు అనేది ప్ర‌జ‌లే డిసైడ్ చేస్తారు. కానీ ఒక్క‌టి మాత్రం నిజం.. ప‌బ్లిక్ ప్లాట్‌ఫాంలో శ్రీదేవి రోల్ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. అది నా తప్పే. దీనికి క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాను. కానీ నేను మాత్రం అబద్ధం చెప్పలేదు. శ్రీదేవి అంటే నాకు చాలా గౌర‌వం ఉంది కొన్ని సంవ‌త్స‌రాలుగా ఉత్తర, దక్షిణాదిలో శ్రీదేవికి చాలా ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె న‌టించిన మామ్ చిత్ర ట్రైల‌ర్ చూశాను, చాలా బాగుంది.. సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నాను" అంటూ తెలిపాడు.