Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉంది: దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్

గురువారం, 12 జనవరి 2017 (08:46 IST)

Widgets Magazine
ss rajamouli

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. 'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12 కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని కొనియాడారు. రచయిత సాయిమాధవ్‌ సంభాషణలు, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తెలుగు చిత్రాల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు. 
 
కాగా, బాలకృష్ణ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగానే గురువారం ఉదయం 5.15గంటలకు కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లో బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ షోకి బాలయ్యతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, క్రిష్, నటుడు నారా రోహిత్ హాజరయ్యారు. 
 
తెలుగు వాడి ప్రతిభను చాటే చిత్రంగా గౌతమి పుత్ర శాతకర్ణి తెరకెక్కింది. ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్థరాత్రి నుండే టిక్కెట్ల కోసం అభిమానులు థియేటర్స్ దగ్గర క్యూ కట్టారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌ని చిరు ఫుల్‌ఎంటర్‌టైన్ చేయగా, నందమూరి అభిమానులను బాలయ్య మరింత అలరిస్తాడని చెప్పుకుంటున్నారు. 
 
అంజనాపుత్ర క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన శాతకర్ణి చిత్రం గత రికార్డులు చెరిపేయనుందని అంటున్నారు. సంక్రాంతి పండుగకే ముందే శాతకర్ణి చిత్రంతో తమకు పెద్ద పండుగను బాలయ్య తీసుకొచ్చాడంటూ అభిమానులు అల్లర్లతో థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajamouli Tweets Gautamiputra Satakarni

Loading comments ...

తెలుగు సినిమా

news

అభిలాష పాటకు నెట్టింట్లో బ్రహ్మరథం.. ఒక్క రోజులోనే 30వేల మంది చూశారు..

నందమూరి హీరో బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విజయవంతం కావాలని ఫ్యాన్స్ ...

news

టికెట్ దొరకలేదు. గొంతు కోసుకున్నాడు. తిక్క ముదిరినట్టేనా?

ఒకరిది 150వ సినిమా తీస్తున్న సంబరం. మరి కొందరిది పదేళ్ల తర్వాత వస్తున్న తమ అబిమాన హీరో ...

news

సినీ నటి రంభ కూడా తక్కువేం తినలేదట.. కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

భర్తతో కలిసి జీవించేలా ఆదేశించాలని కోరుతూ కోర్టు ఆశ్రయించిన సినీ నటి రంభ కూడా తక్కువేం ...

news

గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ రిపోర్ట్: బడుగు జాతి కాదు తెలుగు జాతి.. ఇద్దరు చంద్రులకు థ్యాంక్స్ చెప్తూ..?

పదేళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాతో ...

Widgets Magazine