ఆ సీక్రెట్ నాకు తెలియదు.. లేదంటే నా జుట్టు... రజినీకాంత్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హోదా అనుభవిస్తున్నప్పటికీ... ఆయనలో ఆ స్టార్ హోదా మచ్చుకైనా కనిపించదు. కులమతాలకు అతీతంగా, దేశ విదేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయినా అతి సామాన్య వ్యక్తిలా ఉండే జీవితాన్నే ఇ

rajinikanth
pnr| Last Updated: శుక్రవారం, 13 జులై 2018 (10:33 IST)
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హోదా అనుభవిస్తున్నప్పటికీ... ఆయనలో ఆ స్టార్ హోదా మచ్చుకైనా కనిపించదు. కులమతాలకు అతీతంగా, దేశ విదేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయినా అతి సామాన్య వ్యక్తిలా ఉండే జీవితాన్నే ఇష్టపడతారు.
 
అంటే, సినిమాల‌లో ఎంతో స్టైలిష్‌గా ఉండే ర‌జ‌నీకాంత్‌, నిజజీవితానికి వ‌చ్చే స‌రికి పూర్తి వ్య‌తిరేఖంగా ఉంటారు. ఎంత పెద్ద వేడుక అయిన సింపుల్‌గా వెళ‌తారు. రజినీకాంత్‌కి జుట్టు లేకపోయిన ఏనాడు ఆయ‌న బ‌య‌ట విగ్గు ధ‌రించ‌రు. అయితే తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ర‌జ‌నీకాంత్ త‌న హెయిర్‌కి సంబంధించి చ‌మ‌త్కారం చేసి అంద‌రిని న‌వ్వించారు. 
 
త‌మిళ‌నాడుకి చెందిన ప్ర‌ముఖ రాజకీయ నేత ఏసీ షణ్ముగం. ఈయన్ను డాక్టరేట్‌తో‌ సత్కరించేందుకు ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఈ కబాలీ హాజరయ్యారు. త‌న స్నేహితుడైన షణ్ముగ‌ంను స‌త్క‌రించిన తర్వాత రజినీకాంత్ మాట్లాడారు. 
 
"నాకు 1980 నుండి ష‌ణ్ముగ‌న్ తెలుసు. మా ఇద్ద‌రికి మంచి అనుబంధం ఉంది. ఈ వ‌య‌సులోనూ ఆయ‌న ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ముఖంలో చాలా క‌ళ ఉంటుంది. ఎప్పుడు న‌వ్వుతూ ఉంటారు. హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ స్టైల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో నాకు తెలిసి ఉంటే నా జుట్టు ఊడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేవాడి"న‌ని చ‌మ‌త్క‌రించారు ర‌జనీ. దీంతో అక్క‌డి వారు తెగ న‌వ్వేశారు. 
 
ప్రస్తుతం రజనీ.. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్ క‌థానాయిక‌గా నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. దీనిపై మరింత చదవండి :