బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2015 (11:49 IST)

రజనీకాంత్‌కు హాలీవుడ్‌ జెట్లీ విలన్‌ అట: కబాలీకి సరిగ్గా మ్యాచ్ అవుతాడని..?

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం రోబో-2.. మరోవైపు 'కబాలి' సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. రోబో-2లో ఇప్పటికే అక్షయ్‌కుమార్‌ను ప్రతినాయకుడిగా తీసుకుంటే.. కబాలికి.. హాలీవుడ్‌స్టార్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కబాలి సినిమా గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగుతుంది. బాషాకూడా అలాంటి సినిమానే. కాకపోతే కబాలి అనేది భిన్నంగా వుంటుంది. 
 
ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్రను నలుగురిని అనుకున్నా... హాలీవుడ్‌ నటుడైతే.. రజనీకి వున్న క్రేజ్‌ దృష్ట్యా... ప్రపంచంలోని పలు భాషల్లో విడుదల చేసేందుకు ఈజీగా వుంటుందని తలంచినట్లు తెలుస్తోంది. కబాలి సినిమాలో రెండు షేడ్స్‌ వున్న పాత్రన్ని పోషిస్తున్నాడు. పూర్తిగా నెరిసిన గడ్డం, మీసాలతో ఫుల్‌ సూట్‌లో ఉన్న ఆయన గెటప్‌ ఇప్పటికే అభిమానుల్ని యమ ఖుషీ చేస్తోంది. 
 
ఇక మరో యంగ్‌ గెటప్‌లో సూపర్‌స్టార్‌ కొత్త కోణంలో కబాలీ చిత్రంలో ఆవిష్కృతం కానున్నారు. ఇందుకోసం పలువురి హాలీవుడ్‌ నటుల్ని పరిశీలించినా జెట్లీ ఫైట్లు రజనీ స్టైల్‌‌కు కరెక్ట్‌గా సింక్‌ అవుతాయని ఆయన్నే తీసుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. వీ. క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్‌ హ్యాండిల్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌తో హాంకాంగ్‌ స్టార్‌ ఢీకొనే సన్నివేశాలను 2016 ప్రథమార్ధంలో మలేషియా, హాంకాంగ్‌లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది.