Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''రాజు గారి గది-2''లో తాజా లుక్: పంచెకట్టులో టీచర్‌గా సమంత

ఆదివారం, 8 అక్టోబరు 2017 (15:09 IST)

Widgets Magazine

నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు చెందిన తాజా లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో గ్లామర్ తారగా వెలుగొందిన సమంత టీచర్‌గా మారిపోయింది. చేత్తో బెత్తం పట్టుకొని చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేందుకు సిద్ధమైంది.  రాజుగారి గది-2లో సమంత దెయ్యంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా లుక్‌లో పంచెకట్టులో సమంత పిల్లలకు పాఠాలు చెప్తోంది. 
 
ఈ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటూ, ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇక ఈ మూవీలో సమంత దెయ్యంగా కనిపిస్తుండగా, నాగార్జున మెంటలిస్ట్‌గా కనిపించనున్నారు. సీరత్‌ కపూర్‌, అశ్విన్‌, శకలక శంకర్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీవీపీ సంస్థ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి ఓంకార్‌ దర్శకత్వం వహించగా, థమన్‌ సంగీతాన్ని అందించాడు.
 
బ్లాక్ బస్టర్ సినిమా "రాజుగారి గది"కి సీక్వెల్‌గా రూపొందిన "రాజుగారి గది-2" సెన్సార్ పూర్తయ్యింది. హైక్వాలిటీ విఎఫెక్స్, ఆద్యంతం ఆకట్టుకొనే కథాంశం సినిమాకి కీలకమైన అంశాలని దర్శకనిర్మాతలు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''స్పైడర్'' రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు.. తమిళంలోనూ నిరాశే!

''స్పైడర్'' కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా, ...

news

''అర్జున్ రెడ్డి'' సెన్సార్ కట్ కాని కాపీ విడుదల.. అక్టోబర్ 13న రిలీజ్

వివాదాస్పద చిత్రం అర్జున్ రెడ్డి సినిమా సెన్సార్ కాని కాపీని తాజాగా విడుదల చేస్తున్నట్లు ...

news

రాజశేఖర్ గరుడ వేగ వచ్చేస్తోంది.. సన్నీలియోన్ పాటే హైలైట్..

గరుడ వేగ సినిమా వచ్చేనెల మూడో తేదీన రిలీజ్ కానుంది. రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు ...

news

కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డాను.. ఆ కండిషన్‌ను బ్రేక్ చేశాను: అనురాగ్ కశ్యప్

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన సినిమా షూటింగ్‌లో నటించే హీరోహీరోయిన్లకు చాలా ...

Widgets Magazine