శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (18:18 IST)

రాంచరణ్ - శ్రీను వైట్ల చిత్రం పేరు బ్రూస్‌లీ (ది ఫైటర్)

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. "బ్రూస్‌లీ" అనే టైటిల్‌ను పెట్టి.. దానికి 'ది ఫైటర్' అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
 
 
వాస్తవానికి ఈనెల 22వ తేదీన జరిగిన మెగాస్టార్ చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. నిజానికి ఆ రోజే చిత్ర టైటిల్‌ను కూడా ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ కేవలం టీజర్‌ను మాత్రమే విడుదల చేశారు. టైటిల్‌పై అనేక రకాల పేర్లు పరిశీలనలో ఉండటంతో తుది నిర్ణయం తీసుకోలేక పోయారు. 
 
ఇపుడు టైటిల్‌ను ఖరారు చేసినట్టు రాంచరణ్ తన అధికారిక ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. అలాగే, టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను కూడా పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. దీంతో చిరంజీవి తన 150వ చిత్రం రాంచరణ్‌తో కలిసి నటించినట్టయింది.