శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2015 (16:11 IST)

సల్మాన్‌ ఖాన్‌కు రామ్‌ చరణ్‌ డబ్బింగ్‌ పూర్తి... డబ్బింగ్‌తో సక్సెస్ ఇస్తాడా...!!

సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' సినిమా తెలుగులో 'ప్రేమ లీల' పేరుతో విడుదలవుతుంది. దీపావళి కానుకగా నవంబర్‌ 12న విడుదల కానుంది. ఇక తెలుగు వెర్షన్‌లో సల్మాన్‌ ఖాన్‌కు రామ్‌ చరణ్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఇటీవలే తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ను మొదలుపెట్టిన చరణ్‌, గురువారంతో మొత్తం పూర్తిచేసినట్లు తెలుస్తోంది.
 
సూరజ్‌ భర్జత్యా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రతిష్టాత్మక రాజశ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. సల్మాన్‌ ఖాన్‌ సరసన సోనమ్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటించారు. సల్మాన్‌ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్‌ సినిమాలు గతంలో తెలుగులోనూ మంచి విజయం సాధించడం, రామ్‌ చరణ్‌ డబ్బింగ్‌ చెప్పడం ఈ సినిమాకు ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశాలు. హీరోగా సక్సెస్‌ లేకపోయినా డబ్బింగ్‌గా సక్సెస్‌ ఇస్తాడేమో చూడాలి.