Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

థ్యాంక్యూ చెర్రీ మా కష్టాన్ని గుర్తించినందుకు : చిట్టిబాబుతో భాగమతి

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (11:43 IST)

Widgets Magazine
anushka

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి టాలీవుడ్ లేడీ జేమ్స్‌బాండ్ అనుష్క నటించిన "భాగమతి" చిత్రాన్ని వీక్షించారు. ఆ తర్వాత 'భాగమతి' చిత్రంలోని ఓ ఫోటోను పెట్టి తన ఫేస్‌బుక్ పేజీలో ఓ ట్వీట్ చేశారు. 
 
'భాగ‌మ‌తి' చిత్రంలో అనుష్క న‌ట‌న మైండ్ బ్లోయింగ్‌గా ఉంద‌ంటూ ట్వీట్ చేశాడు. టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. భాగమతి టీమ్ గురించి చెప్పాలంటే అరుపులే. టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు. అందరికీ శుభాకాంక్షలు. భాగమతి సినిమా చూసిన తర్వాత భయంతో నా భార్య రాత్రి నిద్రకూడా పోలేదు. సినిమాకి ధన్యవాదాలు అంటూతన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. 
 
ఈ ట్వీట్‌పై భాగమతి అనుష్క స్పందించారు. జనాలకు నిద్రపోనివ్వకూడదనే మా లక్ష్యం. అది నెరవేరింది. థ్యాంక్యూ రాంచరణ్ గారు. మా కష్టాన్ని గుర్తించినందుకు అంటూ రిప్లై ఇచ్చారు. 
 
అందాల భామ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో పిల్ల 'జమీందార్' ఫేమ్ అశోక్ తెరకెక్కించిన చిత్రం 'భాగమతి'. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టిస్తుంది. ఈ మూవీకి విమ‌ర్శ‌కుల ప్రశంస‌లే కాదు, ఇండ‌స్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్స్ ప్రశంస‌లు కూడా ల‌భించాయి. 
 
కాగా, చెర్రీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో "రంగ‌స్థ‌లం" అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో చిట్టి బాబు పాత్ర పోషిస్తున్నాడు. మార్చి 30న ఈ మూవీ విడుద‌ల కానుంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లి పేరుతో నమ్మించి రూ.కోట్లకు పడగలెత్తిన సినీనటి.. కేసు

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై ...

news

జీఎస్టీ ఎఫెక్ట్ : రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ...

news

రైలులో మలయాళ నటికి వేధింపులు

మలయాళ నటి సనూష రైలులో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీంతో ఆ పోకిరీలను ఆమె అరెస్టు ...

news

ఒక నువ్వు ఒక నేను పాట.. విష్ణు.. శ్రియ నటన అదుర్స్ (వీడియో)

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో హీరోయిన్ శ్రియ గురించి విలక్షణ నటుడు మోహన్ బాబు ...

Widgets Magazine