Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రామ్ చరణ్ 'ధృవ'తో వెనుకడుగు వేసిన బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'

మంగళవారం, 29 నవంబరు 2016 (11:21 IST)

Widgets Magazine
ram charan in dhruva

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' దెబ్బకు బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' వెనుకడుగు వేసింది. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తికావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ డేట్ కూడ ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 9న అదే విధంగా పాటలను డిసెంబర్ 16న విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడ చేశారు.
 
అయితే, రామ్ చరణ్ 'ధృవ' డిసెంబర్ 9న విడుదల అవుతున్న నేపథ్యంలో అదేరోజు బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను విడుదల చేస్తే 'ధృవ' హడావిడి మధ్య సామాన్య ప్రేక్షకులు పట్టించుకోరు అన్న భయం 'శాతకర్ణి' యూనిట్‌కు ఏర్పడినట్లు టాక్. దీనితో 'శాతకర్ణి' మూవీ ట్రైలర్‌ను 'ధృవ' విడుదలకు ఒక రోజు ముందు కానీ లేదా 'ధృవ' విడుదల అయిన మరునాడు కాని విడుదల చేయడానికి 'శాతకర్ణి' యూనిట్ డిసైడ్ అయినట్లు టాక్. 
 
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 200 థియేటర్స్‌లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇంత భారీ ఎత్తున్న విడుదల చేస్తున్న 'శాతకర్ణి' ట్రైలర్ 'ధృవ' హడావిడిలో విడుదల చేస్తే చాలా మంది పట్టించుకోక పోవచ్చు అన్న భావనతో ఈనిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డేటింగ్ వార్తలు అబద్ధమంటూనే ఫామ్‌హౌస్‌లో అడ్డంగా బుక్కైనా దిశా పటానీ

టాలీవుడ్ స్టార్ డైరక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్ దిశా పటానీ. ...

news

టాలీవుడ్‌ టాప్ సెలెబ్రెటీల వద్ద బ్లాక్‌మనీ లేదు : నాగబాబు కామెంట్స్...

నల్లధనంపై మెగా ఫ్యామిలీ హీరో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లోని టాప్ ...

news

ఎవరైనా నా కౌగిలిలో నలిగి పోవాల్సిందే : నటి రెజీనా

టాలీవుడ్ నటి రెజీనా హాట్ కామెంట్స్ చేశారు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం పెద్ద కష్టమేమీ ...

news

విజయం కోసం ఆఖరి రుద్రాభిషేకం... బాలకృష్ణ పూజలు...

శాతవాహన చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' పై జీవిత చరిత్రపై సినిమా చేయడం అది విజయవంతం కావడం ...

Widgets Magazine