Widgets Magazine

పవర్‌ఫులైన అమ్మ ఆత్మ ఏం చేస్తోంది.. తమిళ దేవుళ్ళు, భక్తులు ఏం చేస్తున్నారు?: వర్మ ప్రశ్న

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (14:58 IST)

Widgets Magazine
ram gopal varma

ప్రముఖ సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలిచేందుకు కొత్త అస్త్రాన్ని చేతులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయిన శశికళ వ్యవహారంపై సినిమా తీస్తానని ఎప్పుడో ప్రకటించినా.. ప్రస్తుతం చిన్నమ్మ జైలు కెళ్లాక శశికళ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని ట్వీట్లతో ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా శశికళ సినిమాకు సంబంధించి మొదటి చిత్రాన్ని ఆయన సామాజిక మీడియా ద్వారా విడుదల చేశారు.
 
ఈ సినిమాను తెరకెక్కించే దిశగా పోయెస్ గార్డెన్‌లో తను కొంతమందిని కలిశానని వర్మ చెప్పుకొచ్చారు. అయితే వారు తనకు జయలలిత,  శశికళ బంధం గురించి ఆశ్చర్యపరిచే విషయాలు తెలియజేశారని వర్మ వెల్లడించారు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు పళనిస్వామికే మద్దతుగా ఉన్నారని, అయితే వారు శశికళ చేతిలో బంధించబడి ఉన్న మనార్గుడి మాఫియాతో సంబంధం ఉన్నవారేనని అన్నారు. ఎంతో పవర్‌ఫుల్ అయినటువంటి జయలలిత ఆత్మ ఎవరికీ దీవెనలు అందించడం లేదని, అసలు ఆవిడ ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో తమిళనాడుకు చెందిన అందరు దేవుళ్లు, భక్తులు ఏం చేస్తున్నారని తన ఫేస్‌బుక్ ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేశారు రామ్ గోపాల్ వర్మ. 
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే గౌరవ అధ్యక్షుడు మధుసూదన్ శుక్రవారం ఒక తాజా ప్రకటన విడుదల చేశారు. శశికళ, దినకరన్, వెంకటేష్ ముగ్గురిపై గతంలో ఆరోపణలు రావడంతో జయలలిత వారిని పార్టీ నుంచి బహిష్కరించారని, తర్వాత వారిని క్షమించి మళ్లీ పార్టీలోకి తీసుకున్నప్పుడు పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాల్లో, రాజకీయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని ఆనాడే జయలలిత ఆదేశాలు జారీ చేశారన్నారు. 
 
ఇందుకు సంబంధించిన శశికళ నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నారని మధుసూదన్ తెలిపారు. ఇప్పడు ఆ హామీని ధిక్కరించి దినకరన్‌ను పార్టీ డిప్యూటీ సెక్రటరీగా తీపసుకున్నారని మధుసూదన్ విమర్శించారు. ఇందులో భాగంగా ఆనాడు శశి రాసిన లేఖను మధుసూధన్ మీడియా ముందు ప్రవేశపెట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శశి-జయ బంధంలో షాకింగ్ నిజాలు.. జంతువుల కంటే హీనమా? పళని మాఫియా మెంబర్ ఐతే.. శశి డాన్..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శశికళ మీద పడ్డాడు. గతంలో శశికళ జీవిత కథ ఆధారంగా ...

news

సినిమాలు తీస్తానని నమ్మించి.. బ్లాక్ మెయిల్.. సినీ డైరెక్టర్‌పై అత్యాచార కేసు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. తాను తీసే ...

news

సహజీవనం చేశాడు.. పెళ్లికి నో అన్నాడు.. 'పక్కా ప్లాన్‌' హీరో అరెస్టు

హైదరాబాద్ నగర పోలీసులు టాలీవుడ్ హీరోను అరెస్టు చేశారు. "పక్కాప్లాన్" చిత్రంతో ...

news

ఐటమ్ గర్ల్‌ని కాదు అరబ్ గుర్రాన్ని అంటున్న లక్ష్మీరాయ్

ఐటమ్‌ సాంగ్‌ నుంచి అందాలారబోస్తూ ఎలాంటి పాత్రకైనా రెడీయే కానీ.. నన్ను అందరూ అరబ్‌ ...