మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (12:24 IST)

ఒక్క రజత పతకానికే ఇంత హంగామా... 46 బంగారు పతకాలు సాధించిన వారినేమనాలి: వర్మ

రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలో రజత పతకాన్ని సాధించిన తెలుగమ్మాయి, భారత షట్లర్ పీవీ సింధుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో సటెర్లు వేశారు.

రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ పోటీలో రజత పతకాన్ని సాధించిన తెలుగమ్మాయి, భారత షట్లర్ పీవీ సింధుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో సటెర్లు వేశారు.
 
ఒక్క రజత పతకానికే మనల్ని మనం ఇన్‌క్రెడిబుల్ ఇండియా అని పిలుచుకుంటున్నామని, మరి 46 బంగారు, 37 వెండి, 49 కాంస్య పతకాలు సాధించిన అమెరికాను ఏమని ఏమనాలని, జస్ట్ అడుగుతున్నానని ట్వీట్ చేశాడు.
 
దీనికి ఓ అభిమాని ఘాటైన సమాధానం చెప్పాడు. భారత దేశంలో ప్రజలు మిమ్మల్ని ఓ దర్శకుడిగా భావిస్తున్నారని, అదే మీరు అమెరికా వెళ్తే ఓ మనిషిగా కూడా చూడరని, తేడా అంతేనని ధీటైన సమాధానం ఇచ్చాడు.