మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (09:30 IST)

గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవిత కథ ఆధారంగా మూడు సినిమాలు: వర్మ

గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా మూడు సినిమాలు తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. నయీమ్ నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఆపై అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌గా ఆ తర్వాత కరుడ

గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా మూడు సినిమాలు తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. నయీమ్ నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా ఆపై అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌గా ఆ తర్వాత కరుడుగట్టిన నేరగాడిగా మారిన విధానం భయం కలిగించేలా ఉందన్నాడు.

సంక్లిష్టమైన నయీమ్ కథను ఒక్క భాగంలో చూపించడం అసాధ్యమని.. అందుకే మూడు భాగాలుగా సినిమా తీస్తున్నట్లు తెలిపాడు. నయీమ్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించానని, ఇన్నేళ్లుగా అతడు చేసిన నేరాలలో వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఘటనలు చాలా ఉన్నాయని వెల్లడించాడు. 
 
తరచూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ తాజాగా భారత్‌పై దండెత్తాడు. దేశంలోని క్రీడాభిమానులంతా రియో ఒలంపిక్స్‌లో భారత్‌కు సిల్వర్ మెడల్ వచ్చిన ఆనందంలో ఉంటే... వర్మ వారి సంతోషంపై నిప్పులు చల్లాడు. ‘ఒక్క రజతపతకం సాధించినందుకే మేరా భారత్‌మహాన్ అని మురిసిపోతున్నారే... 46 గోల్డ్, 37 సిల్వర్ పతకాలు సాధించిన అమెరికా ఎంత గర్వపడాలి?, 9 బంగారు పతకాలు సాధించిన సౌత్ కొరియా ఇంకెత ఫీల్ అవ్వాలి?’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.