గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జనవరి 2017 (12:42 IST)

నాగబాబు సార్.. మీకు ఇంగ్లీష్ అర్థం కాదు.. తెలుగులో అనువాదం చేయించుకో : రాంగోపాల్ వర్మ కౌంటర్

'నా ట్వీట్టర్ అకౌంట్‌ని ఎవడో ఇడియట్ హ్యాక్ చేసి తెలుగులో ట్వీట్స్ పెట్టాడు....' అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటుడు నాగబాబుకు కౌంటర్ ఇస్తూ బాంబు పేల్చాడు. ఈ సందర్భంగా వర్మ చెబుతూ... అసలు తాను తె

'నా ట్వీట్టర్ అకౌంట్‌ని ఎవడో ఇడియట్ హ్యాక్ చేసి తెలుగులో ట్వీట్స్ పెట్టాడు....' అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటుడు నాగబాబుకు కౌంటర్ ఇస్తూ బాంబు పేల్చాడు. ఈ సందర్భంగా వర్మ చెబుతూ... అసలు తాను తెలుగులో ట్వీట్‌ చేయనే లేదని, చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని వర్మ స్పష్టం చేశాడు. 
 
'ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి సలహా ఇచ్చావో అందరికీ తెలుసు' అంటూ నాగబాబుకి వర్మ చురక అంటించాడు. 'నాగబాబు సార్, మీకు ఇంగ్లిష్‌ అర్థం కాదు కనుక, విద్యావంతుడైన స్నేహితుడి ద్వారా నా ఇంగ్లిష్‌ ట్వీట్లు తర్జుమా చేయించుకుని తెలుసుకోండి' అంటూ సూచించాడు. 
 
గ్రేట్‌ మెగా బ్రదర్‌ ముందు నాగబాబు 0.01 శాతం మాత్రమేనని, అందుకే నాగబాబులా చిరంజీవి అర్థంపర్థం లేని వాగుడు వాగాలేదని ఘాటుగా చురకలంటించారు. ఇకపోతే 'నాగబాబు సార్, ఇప్పుడే 150 ట్రైలర్ చూశాను... చాలా బాగుంది... అవతార్ కంటే కొంచెం గొప్పగానే ఉంది' అంటూ రాంగోపాల్ వర్మ తనదైన స్టయిల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 
 
అంతకుముందు.. గుంటూరు వేదికగా జరిగిన చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికపై నుంచి రాంగోపాల్ వర్మపై నాగబాబు మాటలతూటాలు పేల్చిన విషయం తెల్సిందే. ముఖ్యంగా.. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నాగబాబు విరుచుకుపడ్డారు. 
 
రామ్ చరణ్‌లో టాలెంట్ లేకపోతే... ఎన్ని సర్జరీలు చేసినా ఫలితం లేదంటూ గతంలో యండమూరి వీరేంద్రనాధ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై పెను దుమారమే లేచింది. ఈ వేదికగా నాగబాబు ఆయనపై విరుచుకుపడ్డారు. 'వాడో కుసంస్కారి' అన్నారు. 'వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతాడు, వాడికి వ్యక్తిత్వం లేదు. అలాంటి వాడు మైలేజ్ కోసం చేసే వ్యాఖ్యలు మాకు ఎలాంటి నష్టాన్ని చేకూర్చవు' అంటూ మండిపడ్డారు.
 
అలాగే రాంగోపాల్ వర్మపై కూడా మండిపడ్డారు. ముంబైలో కూర్చుని ట్విట్టర్‌లో మరొకడు వాగుతుంటాడు. 'వాడికి సినిమాలు తీయడం చేతకావడంలేదని, ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి వాగి ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడని అన్నారు. వాడు మర్యాదగా ఉంటే బాగుటుందని ఈ వేదిక సాక్షిగా చెబుతున్నానని ఆయన హెచ్చరించారు. తమ ఫ్యామిలీని ఏదో అనడం ద్వారా మైలేజీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చాడు.