Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోర్న్‌స్టార్ అంటే ఎంతిష్టమో పవన్ కళ్యాణ్ అంతే ఇష్టం.. ఆయన గాండ్రించాలి కానీ దగ్గకూడదు : వర్మ

సోమవారం, 3 జులై 2017 (08:54 IST)

Widgets Magazine
Ramgopal varma

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు కామెంట్స్ చేశారు. పవన్ ఓ సింహం లాంటివాడని, ఆయన గాండ్రించాలేగానీ, దగ్గకూడదంటూ వ్యాఖ్యానించారు. అలాగే, తనకు పోర్న్ స్టార్స్ అంటే ఇంత ఇష్టమో.. పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇష్టమన్నారు. అలాగనీ, ఆయన పిలిచి.. ఎన్నికల్లో పోటీ చేయమని కోరితే పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.
 
ఆర్జీవీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలపై స్పందించారు. పవన్ కల్యాణ్ ట్వీట్లలో చెప్పాలనుకున్న విషయాన్ని ఆయన సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నాడన్నారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆయన మాట్లాడుతుంటే ఒక్కో వ్యక్తి రోమాలు నిక్కబొడుచుకునేవని, పవన్ కల్యాణ్ స్పీచ్‌లు కూడా ఆయనను తలపిస్తుంటాయని వర్మ అభిప్రాయపడ్డారు. 
 
అయితే, ఇటీవలికాలంలో మాత్రం పవన్ కల్యాణ్ స్పీచ్‌లలో మొదటి నుంచి చివరి వరకు వాడి ఉండటం లేదన్నారు. ప్రసంగం మధ్యలో సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ పేరుతో చెప్పాలనుకున్న అంశాన్ని చెప్పలేక డైల్యూట్ చేస్తున్నాడని తెలిపారు. సినీ పరిశ్రమలో ఎవరి మద్దతూ పవన్ కల్యాణ్‌కు అవసరం లేదని వర్మ స్పష్టంచేశారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఇచ్చిన స్పీచ్‌లు అగ్రెసివ్‌గా ఉండేవని, తర్వాత తరగతి గదిలో లెక్చరర్ చెప్పే క్లాసుల్లా మారిపోయాయని వర్మ వ్యాఖ్యానించారు. 
 
చెబితే బాగోదు కానీ తనకు పోర్న్‌‌స్టార్స్ ఎంతిష్టమో... పవన్ కల్యాణ్ కూడా అంతే ఇష్టమని అన్నారు. పవన్ కల్యాణ్ సింహంలాంటి వాడని, సింహం గాండ్రించాలి కానీ దగ్గకూడదన్నారు. అలాగే పవన్ కల్యాణ్‌ను అర్జునుడితో పోల్చి అవమానించవద్దని సూచించారు. అర్జునుడు ప్రతి సందర్భంలోనూ ధర్మరాజు లేదా కృష్ణుడు ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబితే అది చేశాడని, సొంతంగా ఏమీ చేయలేదని వర్మ గుర్తుచేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అబ్బో.. ఏమి అందం : వైరల్‌గా మారిన సన్నీ ట్రెండింగ్ ఫోటోలు

సన్నీ లియోన్.. ఓ పోర్న్ స్టార్. ఇపుడు బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరిగా మారిపోయారు. పైగా, ...

news

జాన్వీ కపూర్‌ను బ్యూటీఫుల్ లుక్... చూడతరమా?

అతిలోకసుందరి శ్రీదేవి ముద్దులు కుమార్తె జాన్వీ కపూర్. బ్యూటీఫుల్‌ లుక్‌తో అదరగొడుతోంది. ...

news

పెద్ద త‌ప్పుచేసినట్లు.. మోసం చేసిన‌ట్లు బూతులు తిట్టారు: స‌ంపూర్ణేష్ బాబు

తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉన్న యువ హీరోల్లో సంపూర్ణేష్ బాబు ఒకరు. హృదయ కాలేయం చిత్రం ...

news

జరగాల్సిన డ్యామేజ్ జరిగింది... ఇపుడు చెప్పేందుకు ఏమీలేదు : భరత్ మరణంపై హీరో రవితేజ

తన సోదరుడు భర్త మరణం, అంత్యక్రియల సమయంలో తమ ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ, ...

Widgets Magazine