శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (11:55 IST)

రామ్ గోపాల్ వర్మను చంపేసిన పవన్ ఫ్యాన్స్: వర్మకు ఎక్కడో కాలిందట!

సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా.. సెలబ్రిటీలపై తనకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తూ వివాదంలో నిలిచే వర్మకు పవన్ ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. పవన్ ఫ్యాన్స్‌కు సాంకేతిక తెలివి లేదని, సమంత, మహేష్ బాబు కంటే పవన్ ఫ్యాన్స్‌ అంత తెలివిమంతులు కారని ఇటీవల ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మపై పవన్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోయారు. 
 
మహేశ్.. సమంతాల ట్విట్టర్ అకౌంట్లో ఫాలోయర్స్‌తో పోలిస్తే పవన్ కల్యాణ్ ఫాలోయర్స్ తక్కువగా ఉన్నారని.. పీకే ఫ్యాన్స్‌కి ఇంగ్లీష్ రాకపోవడమే కారణమని వర్మ చేసిన ట్వీట్లు మంట పుట్టించడంతో పాటు పవన్ ఫ్యాన్స్‌కు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించాయి. దీంతో హఠాత్తుగా రాంగోపాల్ వర్మ మరణించాడని.. దీంతో సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలిగిపోయిందంటూ ఒక ఇమేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. అందులో ప్రతి ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్.. ‘‘రిప్’’తో పాటు.. సదరు ఇమేజ్‌ను షేర్ చేయాలంటూ కోరారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటం.. దీన్ని చూసిన రాంగోపాల్ వర్మకు మరెక్కడో కాలిపోయింది.
 
తన ట్వీట్లతో చిరాకు పుట్టించటం.. మంట పుట్టించటం మాత్రమే తెలిసిన వర్మకు.. తనకే మంట పుట్టించిన పీకే ఫ్యాన్స్‌‍పై షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ.. ట్విట్టర్‌లో మరో మాటల యుద్ధానికి తెరతీశారు. తాను మరణించినట్లుగా ఇమేజ్ తయారు చేయటమే కాకుండా.. తన మరణానికి సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తుందంటూ పోస్ట్ ఇమేజ్‌ను తిరిగి పోస్ట్ చేస్తూ.. పవన్ ఫ్యాన్‌పై శివాలెత్తాడు.
 
పవన్ ఫ్యాన్ పై వర్మ ట్విట్టర్ ట్వీట్స్ చూస్తే  పీకే ఫ్యాన్స్ నిజ రూపం ఇదేనంటూ తాను మరణించినట్లుగా రూపొందించిన ఇమేజ్‌ను ప్రస్తావిస్తూ.. ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్య పెరగాలని తాను ఆశిస్తున్నట్లు.. అందులో అనాగరికుల సంఖ్య తక్కువగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లిషుపై అవగాహన పెంచేందుకు పవన్ కల్యాన్ స్కూళ్లు స్టార్ట్ చేయాలని.. వారిలో ఇంగ్లిషు అవగాహనను పెంచాలని కోరారు.
 
పీకేకు మెగా ఫ్యాన్ అయిన తన సూచన ఏమిటంటే.. పీకే ఫ్యాన్స్ అక్షరాస్యులుగా మారాలని.. తన సొంత ఫ్యాన్స్‌ను చూసుకొని పవన్ కల్యాణ్ ఇబ్బంది పడేలా చేయొద్దన్నాడు. ఆలోచనల్లో తనను చంపొచ్చు కానీ.. తన ఆలోచనల్ని చంపలేరని వర్మ కామెంట్ చేశాడు. 
 
అంతేగాకుండా సాంకేతికంగా వికలాంగులు (అక్షరం ముక్క రాని వాళ్లు)  తనను అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించాడు. పీకేకు మెగా పవర్ ఫ్యాన్ అయిన తన కోరిక ఏమిటంటే..? పీకే ఫ్యాన్స్‌లోని నిరక్షరాస్యులు కనీసం మహేష్ ఫ్యాన్స్ నుంచైనా పాఠాలు నేర్చుకోవాలని కోరాడు. తాను పోస్ట్ చేసే ఇంగ్లీషు ట్వీట్లను తెలుగులోకి తర్జుమా చేయాలంటూ మహేశ్ ఫ్యాన్‌ని కోరారు. అంతేగాకుండా రైతుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న పవన్ కల్యాణ్, తన ఫ్యాన్స్ అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ కృషి చేయాలని కోరాడు.