Widgets Magazine Widgets Magazine

శశి-జయ బంధంలో షాకింగ్ నిజాలు.. జంతువుల కంటే హీనమా? పళని మాఫియా మెంబర్ ఐతే.. శశి డాన్..

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (12:43 IST)

Widgets Magazine

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శశికళ మీద పడ్డాడు. గతంలో శశికళ జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో జైలుకెళ్లిపోయిన చిన్నమ్మ గురించి సినిమా తీసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇందులో భాగంగా  రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. దివంగత జయలలిత, శశికళల మధ్య ఉన్న బంధంలో అనేక షాకింగ్ నిజాలున్నాయని-పోయస్ గార్డెన్‌లో పని చేస్తున్న వారు ఈ నిజాలను తనకు చెప్పారని వర్మా ట్వీట్ చేశాడు. అంతేగాకుండా జయలలిత-శశికళల మధ్య తాను తెరకెక్కించే 'శశికళ' సినిమాలో ఈ నిజాలను బయటపెడతానని వర్మ ట్వీట్ చేశాడు.
 
అంతేగాకుండా తమిళ రాజకీయాలపై కూడా రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. మెజారిటీ ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు పలకడానికి కారణం, వారంతా శశికళకు చెందిన మన్నార్ గుడి మాఫియా ఎంపిక చేసినవారేనని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని కూడా పోయస్ గార్డెన్‌లో పని చేస్తున్న ఓ తోటమాలి చెప్పాడని వర్మ ట్వీట్ చేశాడు. కనీసం వ్యతిరేకించే అవకాశాన్ని కూడా ఎమ్మెల్యేలకు శశికళ ఇవ్వడం లేదని వర్మ వ్యాఖ్యానించాడు. 
 
ఇంకా మన్నారు గుడి మాఫియా సభ్యుడైన పళని స్వామి తమిళనాడు సీఎం అయితే.. డాన్ శశికళ జైలు నుంచే తమిళ సర్కారును నడిపిస్తోందని వర్మ విమర్శించాడు. జంతువులను హింసించే జల్లికట్టు పట్ల తమకున్న ప్రేమపై తమిళులు కనీసం ఒక శాతమైనా గర్వించవచ్చని... ఎందుకంటే తమిళ నాయకులు ప్రజలను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారని చెప్పాడు.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

సినిమాలు తీస్తానని నమ్మించి.. బ్లాక్ మెయిల్.. సినీ డైరెక్టర్‌పై అత్యాచార కేసు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. తాను తీసే ...

news

సహజీవనం చేశాడు.. పెళ్లికి నో అన్నాడు.. 'పక్కా ప్లాన్‌' హీరో అరెస్టు

హైదరాబాద్ నగర పోలీసులు టాలీవుడ్ హీరోను అరెస్టు చేశారు. "పక్కాప్లాన్" చిత్రంతో ...

news

ఐటమ్ గర్ల్‌ని కాదు అరబ్ గుర్రాన్ని అంటున్న లక్ష్మీరాయ్

ఐటమ్‌ సాంగ్‌ నుంచి అందాలారబోస్తూ ఎలాంటి పాత్రకైనా రెడీయే కానీ.. నన్ను అందరూ అరబ్‌ ...

news

బాత్‌రూమ్‌ సింగర్‌ నుంచి స్టూడియో సింగర్‌గా... యాంకర్ సుమ

''నేను అందరిలాగానే బాత్‌రూమ్‌లో పాటలు పాడతాను. కానీ స్టూడియో సింగర్‌గా అవుతానని అస్సలు ...