Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ సినిమాలో రంభ.. అంతా త్రివిక్రమ్ ప్లాన్?

బుధవారం, 16 మే 2018 (14:55 IST)

Widgets Magazine

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతంలో సీనియర్ నటులను తన సినిమాల కోసం ఎంపిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాలో నదియాను, అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్భూను తీసుకున్న త్రివిక్రమ్.. తాజాగా యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో రంభను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 
 
జై లవ కుశ సినిమాతో మంచి విజయం సాధించిన ఎన్టీఆర్‌ కొంత గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. తొలి షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించిన త్రివిక్రమ్, రెండో షెడ్యూల్‌లో ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రంభను తీసుకున్నట్లు సమాచారం‌.
 
ఇక ఎన్టీఆర్ సరసన నాగ, యమదొంగ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసిన ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి రంభ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందట. కాగా, రంభ టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభుదేవా, నాగార్జున, వెంకటేష్‌తో నటించిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఐ కెనాట్ వెయిట్ ఫర్ సమ్మర్' అంటున్న బాలీవుడ్ స్టార్ కుమార్తె

బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు సంజయ్‌దత్. ఈయన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలుశిక్షను ...

news

25 రోజులు రూ.205 కోట్లు.. "భరత్ అనే నేను" కలెక్షన్స్...

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం "భరత్ అనే నేను". ఈ చిత్రానికి కొరటాల శివ ...

news

సావిత్రి పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన జ‌మున‌..!

మ‌హాన‌టి సావిత్రి అయితే... ఆ త‌ర్వాత స్థానం జ‌మున‌దే. ఇద్ద‌రు మంచి స్నేహితులు. అక్కా, ...

news

నేల టికెట్‌కు తర్వాత ''సాక్ష్యం''.. ఆడియో వేడుకకు ఓకే చెప్పిన పవన్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి సినిమాకు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. ...

Widgets Magazine