Widgets Magazine Widgets Magazine

'ధృవ' దున్నేస్తాడా...? 'టాలీవుడ్ కండల వీరుడు' చెర్రీ 2017 బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడా...?

బుధవారం, 30 నవంబరు 2016 (15:07 IST)

Widgets Magazine

రామ్ చరణ్ తేజ ధృవ చిత్రం డిసెంబరు 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం కోసం చెర్రీ బాగా కండలు పెంచేశాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చిత్రాలు రెడీగా ఉన్నప్పటికీ 2017 జనవరి బోణీ మాత్రం రామ్ చరణ్ చిత్రం ధృవదేననే అంచనాలు నెలకొన్నాయి. లక్కీ అండ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించడమూ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడంతో అంచనాలు పెరిగాయి.
rakul-cherry
 
అసలు ఈ సినిమా ప్ర‌క‌టించిన రోజు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే మ‌గ‌ధీర వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత  రాంచ‌ర‌ణ్‌, గీతార్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ `ధృవ` కావ‌డంతో సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.
 
అంద‌రి అంచ‌నాల‌కు మించుతూ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్ స‌హా రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌ర‌కు `ధృవ` ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది. విడుద‌లైన ఇరవై నాలుగు గంట‌ల్లోనే 2 మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకున్న `ధృవ‌` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఇప్ప‌టికి నాలుగు మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేస్తున్నారు. అంత కంటే ముందుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, ప్రేక్ష‌కులు, మెగాభిమానుల స‌మ‌క్షంలో డిసెంబ‌ర్ 4న హైదరాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ లైన్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
 
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ త‌మిళ, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గుంటూరు నుంచి పోటీ చేయనున్న నందమూరి తారక్.. నెలరోజులుగా అక్కడే మకాం..

నందమూరి కుటుంబానికి చెందిన మరో హీరో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తలు ఫిల్మ్ ...

news

అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా వివాహ బంధానికి మంగళం పాడినట్టే.. కౌన్సిలింగ్‌కు హాజరు

బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరాల పెళ్ళి బంధానికి తెరపడేలా వుంది. తమ 17 ఏళ్ల వివాహ ...

news

సహజనటికి కోపమొచ్చింది.. సినిమా సెట్స్‌ నుంచి జయసుధ వాకౌట్‌!

నిత్యం ప్రశాంతవదనంతో.. నవ్వుతూ కనిపించే సహజనటి జయసుధకు కోపమొచ్చింది. దీంతో ఆమె సినిమా ...

news

పెళ్లీ గిళ్లీ కాలేదంటోంది... కానీ అతడితో కాపురం పెట్టేసిన హీరోయిన్

నయనతార అంటే వివాదాల పుట్ట. ప్రేమ అంటే ఇదేరా అన్నట్లు ఉంటుంది ఆమె బిహేవిర్ అని కోలీవుడ్ ...