శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (16:16 IST)

కలాం కన్నుమూత... రాంగోపాల్ వర్మ వెకిలి ట్వీట్స్... ఆయనంతే....

రాంగోపాల్ వర్మ దేశంలో ఏ సంఘటన జరిగినా దానిపైన ట్విట్టర్లో తనదైన వెరైటీ శైలిలో స్పందిస్తుంటారు. పుష్కరాలు, తొక్కిసలాట, ఇంకా చనిపోయినవారి గురించి... ఇలా ఎవ్వరినీ వదిలిపెట్టకుండా ట్వీటుతుంటారు. తాజాగా భారతరత్న అబ్దుల్ కలాం కన్నుమూతపైనా ఆయన ట్విట్టర్లో స్పందించారు. మనిషి చనిపోయాక సెలబ్రిటీలు, కొందరు ప్రజలు వారి పట్ల ఇంత ప్రేమాభిమానాలు చూపుతారు కానీ బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోరు. తనకు ఇదే ఆశ్చర్యకరంగా అర్థంకానిదంటూ ట్విట్టర్లో స్పందించారు. ఇంత ప్రేమాభిమానాలు చూస్తే చనిపోయిన కలాం... అంటూ ఇలా ట్వీట్ చేశారు. చూడండి...