గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 21 నవంబరు 2015 (12:52 IST)

రాజ్ తరుణ్‌ను రాంగోపాల్ వర్మ పొగడ్తాండ...?! తిడతాండ...?!!

దర్శకుడు రాంగోపాల్ వర్మ మాటలు కొన్నిసార్లు అర్థంకావు. ఆయన చేసే వ్యాఖ్యలు పొగిడినట్లున్నాయా.. తిట్టినట్లున్నాయా అనేది కూడా అర్థం కాదు. ఇప్పుడు కుమారి 21 ఎఫ్ సినిమాలో హీరోగా నటించిన రాజ్ తరుణ్‌ను ఉద్దేశించి కూడా వర్మ ఇలాగే స్పందించాడు. శనివారం పొద్దుటే లేచిన వర్మ ట్వీట్లతో కుమారి 21 ఎఫ్ పైన తన అభిప్రాయాన్ని రాసుకొచ్చారు.
 
రాజ్ తరుణ్ను చూసి మిగతా టాలీవుడ్ సినిమా వారసులుగా వస్తున్న హీరోలు నేర్చుకోవలంటూ రాజ్ తరుణ్‌ను ఉద్దేశించి ట్వీటాడు. తన ట్విట్టర్లో వర్మ పేర్కొంటూ.. తెలుగు సినిమా హద్దులు చెరిపేస్తున్న రాజ్ తరుణ్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. పాత తరహా సినిమాలకే పరిమితమైన ఇప్పటి కుర్ర హీరోలు రాజ్ తరుణ్ను చూసి ఎంతో నేర్చుకోవాలి.
 
ప్రేక్షకులను ఇడియట్స్గా భావించి సినిమాలు చేసే స్టార్ వారసులు రాజ్ తరుణ్ నుంచి నేర్చుకుంటారని అనుకుంటున్నా. కుమారి 21ఎఫ్ విజయం సాధించిన సందర్భంగా రాజ్ తరుణ్, హేబా పటేల్, సూర్య ప్రతాప్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పుకున్నారు. మొత్తమ్మీద ఈ కామెంట్లు రాజ్ తరుణ్ ను పొగుడుతూ చేశారా... లేదంటే తిడుతూ చేశారా అనే చర్చ జరుగుతోంది. కుమారి 21 ఎఫ్ చిత్రంపై మిశ్రమ స్పందన లభిస్తున్న తరుణంలో వర్మ కామెంట్లు కాస్త హీటెక్కిస్తున్నాయి.