Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి' దెబ్బకు బాలీవుడ్‌కు నిద్రకరువైంది.. అందుకే దుష్ప్రచారం : రానా

మంగళవారం, 16 మే 2017 (16:58 IST)

Widgets Magazine
rana

"బాహుబలి" చిత్రం సాధించిన విజయంతో అన్ని చిత్రపరిశ్రమల రికార్డులు గల్లంతైపోయాయి. ముఖ్యంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు నమోదైవున్న అన్ని రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా బాహుబలి చిత్రం విజయంతో బాలీవుడ్ ప్రముఖులు ఖిన్నులైపోయారు. నోటమాట రావడం లేదు. బాలీవుడ్ బడా హీరోలు కనీసం సినిమాను మెచ్చుకోవడం పక్కన పెడితే.. నోరు మెదిపి సినిమా గురించి మాట్లాడింది లేదు. పైగా, తమ చిత్రాల రికార్డులే గొప్పగా భావిస్తూ వచ్చిన వారికి నిద్రకరవైంది.
 
ఇక బాలీవుడ్ మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు బాహుబలి, భల్లాలదేవ క్యారెక్టర్లు బాలీవుడ్ హీరోలకు వెళ్లాయంటూ కథనం రాసేసింది. తొలుత బాహుబలి క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్‌ను, భల్లాలదేవ కేరెక్టర్ కోసం జాన్ అబ్రహాంను రాజమౌళి సంప్రదించాడంటూ ఓ బాలీవుడ్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసేసింది. 
 
దీనిపై బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రను పోషించిన రానా ఘాటు రిప్లై ఇచ్చాడు. "అదంతా పచ్చి అబద్ధం. సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే ప్రభాస్ అందులో హీరో అయిపోయాడు. ఆ తర్వాత వెంటనే అందులో నేనూ చేరిపోయాను" అంటూ ఆ మీడియా సంస్థకు రిప్లై ఇచ్చాడు రానా. ఆ రిప్లైతో వెంటనే తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకుని ఆ ట్వీట్‌ను తొలగించడం ఆ మీడియా సంస్థ వంతైంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tweet Baahubali Rana Daggubati

Loading comments ...

తెలుగు సినిమా

news

'బీకాంలోని ఫిజిక్స్‌లాగా.. నీ నడుమెక్కడే నాజూకు తీగ' : దుమ్మురేపుతున్న "అంధగాడు" పాట (Audio)

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం అంధగాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ...

news

సుచీ లీక్స్: ఇప్పటికీ ఆగని తారల ఫోటోలు.. చెన్నై కమిషనర్‌ను ఆశ్రయించిన సుచిత్ర

సుచీలీక్స్ దక్షిణాదిన సంచలనానికి తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే తన పేరిట పలు అకౌంట్లు ...

news

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 'సముద్రపు దొంగలు'... రూ.2 వేల కోట్లకు కుచ్చుటోపీ

రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన కాదేదీ ...

news

షాక్... ఫ్లాప్ హీరోయిన్‌తో 'బాహుబలి' ప్రభాస్ నటిస్తున్నాడా...? 'సాహో'రే?

బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో ...

Widgets Magazine