గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2017 (09:00 IST)

హీరోయిన్ల పర్సనల్ మేనేజర్ల కడుపుకొట్టిన హీరో రానా.. వారిపై ఎందుకంత కసి?

తెలుగు చిత్ర పరిశ్రమ సరికొత్త ఒరవడిలోకి వెళ్లనుంది. ఇప్పటివరకు హీరో, హీరోయిన్లతో పాటు.. ఇతర ఆర్టిస్టుల కాల్షీట్లు చూసేందుకు, ఇతర వ్యవహారాలు చక్కబెట్టేందుకు వ్యక్తిగత మేనేజర్లు ఉన్నారు. ఇకపై వీరు మాయం

తెలుగు చిత్ర పరిశ్రమ సరికొత్త ఒరవడిలోకి వెళ్లనుంది. ఇప్పటివరకు హీరో, హీరోయిన్లతో పాటు.. ఇతర ఆర్టిస్టుల కాల్షీట్లు చూసేందుకు, ఇతర వ్యవహారాలు చక్కబెట్టేందుకు వ్యక్తిగత మేనేజర్లు ఉన్నారు. ఇకపై వీరు మాయం కానున్నారు. అంటే.. ఆర్టిస్టుల డేట్స్, షెడ్యూల్స్ ఫిక్స్ చేసే మేనేజర్ల వ్యవస్థ మటుమాయం కాబోతోందన్నమాట. 
 
ప్రస్తుతం ఉన్న మేనేజర్లు నటీ నటుల రెమ్యూనరేషన్‌ను నిర్ణయించి వారికి, నిర్మాతలకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారాలు చక్కబెట్టినందుకు వీరికి ఆర్టిస్టుల పారితోషికంలో 20 నుంచి 30 శాతం కమిషన్ లభిస్తూ వచ్చింది. అయితే టాలీవుడ్‌లో అతిపెద్ద కుటుంబం నుంచి వచ్చిన నటుడు రానా దగ్గుబాటి. ఈయన మదిలో సరికొత్త ఐడియాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాడు. 
 
ఇందులోభాగంగా, టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ "క్వాన్"ను లాంచ్ చేశాడు. తద్వారా మేనేజర్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నాడు. ఈ సంస్థకు దక్షిణాదిలో హెడ్‌గా రానా వ్యవహరించనున్నాడు. మేనేజర్ల స్థానే పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులను ఈ సేవల కోసం వినియోగించుకోవాలన్న అద్భుతమైన ఆలోచనలో రానా ఉన్నాడు. 
 
ముఖ్యంగా అనుష్క, తమన్నా, నయనతార, రకుల్, సమంత వంటి అగ్ర హీరోయిన్లు సైతం తమ సినీ ప్రాజెక్టుల విషయంలో తమ పర్సనల్ మేనేజర్ల‌పైనే ఆధారపడుతుంటారు. ఒక్కోసారి ఒకే మేనేజర్ నలుగురైదుగురు ఆర్టిస్టుల వ్యవహారాలను డీల్ చేస్తుంటాడు. కానీ రానా ఈ సిస్టంను మార్చేస్తున్నాడు. రానా కంపెనీయే ఆర్టిస్టుల ప్రాజెక్టులను, ఇతర వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. 
 
కేవలం టాలీవుడ్ నుంచే కాక, ఇతర దక్షిణాది సినీరంగాలకు చెందిన నటీనటుల డేట్స్, షెడ్యూల్స్ వగైరాలన్నీ చూసేలా ఈ వ్యవస్థను రానా ఏర్పాటు చేయనున్నాడు. ఇలాంటి వ్యాపారాన్ని కొన్ని రోజుల క్రితం దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో మహేష్ బాబులు కూడా ప్రారంభించిన విషయం తెల్సిందే.