Widgets Magazine

రంగస్థలం సక్సెస్ మీట్‌కు పవన్.. సమంత కూడా వస్తుందా?

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (09:23 IST)

రంగస్థలం సినిమా సక్సెస్ మీట్‌కు రంగం సిద్ధం అవుతుంది. మెగా ఫ్యాన్స్‌ ఈ సమ్మర్‌లో పండగ చేసుకోబోతున్నారు. రంగస్థలం సక్సెస్ మీట్‌కు పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా రానున్నారు. ఇప్పటికే రంగస్థలం సక్సెస్ మీట్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్ రిలీజ్ అయ్యింది. రామ్ చరణ్‌తేజ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ''రంగస్థలం'' మార్చి 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. 
 
కాగా ఈ మూవీలో చిట్టిబాబు‌గా రామ్ చరణ్ నటనకు సినీ ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. రికార్డ్ కలెక్షన్ల‌తో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్న ఈ మూవీని ఇటీవల జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించి చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంకా సక్సెస్ మీట్‌కు వస్తానని హామీ ఇచ్చారు. 
 
మరోవైపు తన భర్త రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బంపర్ హిట్ కావడంతో కామినేని కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తన మొక్కు తీర్చుకున్నారు. గురువారం సాయంత్రం నడకను ప్రారంభించిన ఆమె, కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆపై శుక్రవారం ఉదయం ఉపాసన వీఐపీ బ్రేక్ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సిబ్బంది ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇక రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యాక భర్తతో కలిసి ఫారిన్‌ ట్రిప్పేసిన సమంత హైదరాబాదులో దిగింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. రంగస్థలం సినిమా సూపర్ హిట్ కావడమే గాక, ఇందులో సమంత చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా తన సంతోషాన్ని పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే రంగస్థలం సక్సెస్ మీట్‌కు ఆమె హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు తన తదుపరి సినిమా ''యూటర్న్'' కోసం కూడా సమంత ప్రిపేర్ అవుతోంది. తనే నిర్మాతగా వ్యవహరిస్తూ ''యూటర్న్'' సినిమాను సమంత తెరకెక్కించనుంది. ఇందులో మరో ముఖ్య పాత్రలో భూమిక నటించబోతున్నట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు.. వెనక్కి తగ్గిన "మా".. శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేత

కాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తూ, హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనలు ...

news

"రంగస్థలం" మొక్కు తీర్చుకున్న చిట్టిబాబు భార్య... నేడు సక్సెస్ మీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన శ్రీనివాసుడికి మొక్కు తీర్చుకున్నారు. తన భర్త ...

news

నానిని తొక్కేసిన అనుపమ పరమేశ్వరన్.. ఎలా?

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కు అభిమానులు ఎక్కువే. క్యూట్ లుక్ తో ప్రేక్షకులకు బాగా ...

news

ఔను... మన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. శ్రీరెడ్డికి నా మద్దతు : నటి అర్చన

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డికి మరో నటి ...