శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (11:56 IST)

మనిషి కాదు... రాక్షసుడు.. బాలిక పొట్టపై కాలుపెట్టి... (వీడియో)

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతర్ ఓ హృదయ విదారక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో రగిలిపోతారు. ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు.

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతర్ ఓ హృదయ విదారక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో రగిలిపోతారు. ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ బాలికను కిందపడేసి పొట్టపై కాలుతో తొక్కుతూ నానా చిత్రహింసలకు గురిచేశాడు. ఈ వీడియోను రష్మీ షేర్ చేసింది. 
 
తన సందేశంలో ఈ వీడియో తనకెవరో ఫార్వడ్ చేశారని, దీనిని షేర్ చేయాలని తనకు అనిపించిందని ఆమె చెప్పింది. వీడియో చూస్తుంటే... ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా అతను ఇంత దారుణంగా ఆమెను హింసిస్తున్నట్లు తెలుస్తోందని భావిస్తున్నట్లు ఆమె తెలిపింది. తానిప్పటి వరకు ఎక్కడా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త కళ్లారా చూడనేలేదని పేర్కొంది. 
 
అందుకే దీనిని షేర్ చేస్తున్నానని, తాను చేసింది కరెక్టేనని భావిస్తున్నట్లు ఈ క్రేజీ యాంకర్ పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో ఇంత దారుణానికి పాల్పడుతున్న వ్యక్తిని, అందుకు సహకరించిన వారిని, అక్కడే ఉండి కళ్లప్పగిచ్చి ప్రేక్షక పాత్ర వహించిన వారినీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.