కోలీవుడ్‌కి పిలిచారు... వచ్చేసానుంటున్న రష్మిక

RashmikaMandanna
వాసు| Last Updated: గురువారం, 14 మార్చి 2019 (11:38 IST)
విజయ్‌ దేవరకొండకు జోడీగా ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం కార్తీ కథానాయకుడిగా ‘రెమో’ ఫేం బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలోని కథానాయిక పాత్రతో తమిళ పరిశ్రమలోకి అడుగిడబోతోంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా రష్మికకి తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారంనాడు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రష్మిక..
‘నన్ను నటిగా కన్నడ, తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరించారు. 2019వ సంవత్సరంలో కోలీవుడ్‌కు రమ్మని మీరూ అడిగారు (కోలీవుడ్‌ ఫ్యాన్స్‌), చివరికి వచ్చేసాను. మీకు నా అమితమైన ప్రేమను పంపుతున్నా. కార్తీ, తదితర బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె పోస్ట్‌ చేసారు.

అదేవిధంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథనాయకుడిగా నటిస్తున్న భీష్మ సినిమాలోనూ రష్మిక కథానాయిక పాత్ర పోషించబోతున్నారు. తాజాగా మహేష్‌బాబు-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు కూడా రష్మిక సంతకం చేసినట్లు సమాచారం.



దీనిపై మరింత చదవండి :