Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవినీతితో ఒక్క మెడల్ కొట్టేస్తా: లంచగొడి ఎస్ఐ పాత్రలో రాశిఖన్నా

హైదరాబాద్, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (05:53 IST)

Widgets Magazine

జగపతి బాబు లెజెండ్ సినిమాలో ఏ ముహూర్తంలో విలన్ పాత్రలో నటించి అదరగొట్టాడో కానీ బాలీవుడు, కొలివుడ్, మల్లువుడ్ అనే తేడా లేకుండా విలన్ పాత్రలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది.  రజనీకాంత్ 2.0 సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రకు ఒప్పుకుని సంచలనం సాధించగా, ఇప్పుడు కొలివుడ్ కూడా విలనీ పాత్రలకోసం పరుగులెడుతోంది. హీరోలే కాదు. హీరోయిన్‌లు కూడా విలనీలుగా నటించడానికి మహా ఇదిగా ముందుకొచ్చేస్తున్నారు.
rashi khanna
 
తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ సినిమాలోనే ప్రతినాయకుడిగా అడుగుపెడుతుండగా నాకేం తక్కువ అంటూ అందాల తార రాశిఖన్నా కూడా అదే సినిమాలో విలన్ పాత్రలోకి దిగిపోయిందని సమాచారం. మోహన్‌లాల్ కథానాయకుడిగా ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తీయనున్న విలన్ సినిమాలా విశాల్ ప్రతినాయకుడిగా ప్రధాన పాత్రలో నటిస్తుంటే, బొద్దు సుందరి రాశీఖన్నా ఒక అవినీతి పోలీసు అధికారిణిగా కన్పించబోతోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా కేరళలోని ఎర్నాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకొంటోంది. భారత్‌లోనే తొలిసారి 8కే రిజల్యూషన్‌ ఫార్మాట్‌లో రూపొందుతోంది. మలయాళంలో భారీ బడ్జెట్‌ చిత్రంగానూ రికార్డు సృష్టిస్తోంది. విశాల్‌, రాశీఖన్నాతో పాటు హన్సిక, శ్రీకాంత్‌, మంజువారియర్‌ లాంటి స్టార్స్‌ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాను నిర్మించడం మరీ విశేషం.
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హమ్మయ్య తమిళ బాహుబలికి విముక్తి లభించినట్లే.. మరి కన్నడ బాహుబలి మాటేంటి?

దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 విడుదలకు ఉన్న అడ్డంకులు ...

news

ఒక స్టార్ ఆవిర్భవించిన వేళ.. ఒక గర్వం ఉదయించని వేళ.. బాహుబలి రాజమౌళిదే అంటున్న ప్రభాస్

ఒక్క సినిమా.. అతడిని దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది గుర్తు పెట్టుకునే స్టార్‌ని ...

news

టాలీవుడ్ సన్నీలియోన్... ఎవరో తెలుసా?

బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీఎంట్రీ అవకాశం వచ్చేపాటికి ...

news

రాజమౌళి మహాభారతం వేరు.. శ్రీకుమార్ మేనన్ భారతం వేరు.. జక్కన్నకు ఢోకా లేదు..?!

వీఏ శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మహాభారంతం రూపుదిద్దుకోనుందని వార్తలు రాగానే.. జక్కన్న ...

Widgets Magazine