Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డిసెంబర్ 10న వస్తున్న రవిబాబు హారర్ థ్రిల్లర్ "త్రివిక్రమన్"

బుధవారం, 30 నవంబరు 2016 (18:25 IST)

Widgets Magazine
trivikraman movie still

అమీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో క్రాంతికుమార్ దర్శకత్వం వహిస్తున్న హారర్ ఎంటర్‌టైనర్ "త్రివిక్రమన్". రవిబాబు, నాగబాబు, శ్రీ (ఈరోజుల్లో), ప్రవీణ్ రెడ్డి, అమూల్య రెడ్డి, సన, ధన్‌రాజ్, డిస్కో సుచిత్ర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తోటకూర రామకృష్ణారావు సహ నిర్మాత. 
 
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  రామసత్యనారాయణ మాట్లాడుతూ "త్రివిక్రమన్" చిత్రం పాటలు తమ మధుర ఆడియో ద్వారానే విడుదలయ్యాయని.. డిసెంబర్ 10న విడుదలవుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని మధుర శ్రీధర్ అన్నారు. ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించిన తాను ఈ చిత్రాన్ని చూశానని, దర్శకుడిగా క్రాంతికుమార్‌కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, భీమవరం టాకీస్ ద్వారా వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని అన్నారు. 
 
దర్శకనిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ.. "ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు "త్రివిక్రమన్" సినిమా చూశారు. ఆయనకు సినిమా విపరీతంగా నచ్చి.. అందరికీ ఫోన్ చేసి చెబుతున్నారు. ఈ ప్రెస్‌మీట్‌కి ఆయన కూడా రావాల్సి ఉన్నా.. అర్జెంట్‌గా చెన్నై వెళ్లాల్సి రావడంతో రాలేకపోయారు. ఆయనతోపాటు మధుర శ్రీధర్, రామసత్యనారాయణ "త్రివిక్రమన్" చిత్రాన్ని ఎంతగానో ప్రమోట్ చేస్తున్నారు. బిజినెస్ పరంగాను రెస్పాన్స్ చాలా బావుంది. డిసెంబర్ 10న వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అన్నారు. "త్రివిక్రమన్" చిత్రానికి సందర్భోచితమైన సంభాషణలు సమకూర్చే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు డైలాగ్ రైటర్ హర్ష వర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ చిత్రంలో తాను చేసిన ఐటెమ్ సాంగ్ తనకు మరిన్ని అవకాశాలు తెస్తుందనే నమ్మకం ఉందని డిస్కో సుచిత్ర (డిస్కో శాంతి సోదరి) తెలిపారు. ఒకింత భయపెడుతూనే.. ఆద్యంతం వినోదం పంచుతూ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన "త్రివిక్రమన్" ఆ తరహా చిత్రాలను ఇష్టపడేవారిని అమితంగా అలరిస్తుందని, కొ-ప్రొడ్యూసర్ రామకృష్ణారావు, లైన్ ప్రొడ్యూసర్ శ్యామ్ సుందర్ అన్నారు. కథ-కథనాలు కొత్తగా ఉండడంతోపాటు.. వాటిని తెరకెక్కించిన విధానం వినూత్నంగా ఉండడంతో "త్రివిక్రమన్" చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరిందని బోలె అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Trivikraman Ravi Babu Horror Movie

Loading comments ...

తెలుగు సినిమా

news

గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌'లో సాక్షిచౌద‌రి స్పెష‌ల్ సాంగ్‌....

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం ...

news

కరీంనగర్ గీతాభవన్ కాఫీలాంటి.. కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనం లాంటిది..

కాకినాడ అమ్మాయి ప్రేమలో పడిన కరీంనగర్ కుర్రాడి కథగా రూపొందిన "జయమ్ము నిశ్చయమ్ము రా"... ...

news

నాగ చైతన్యకు షాకిచ్చిన జెస్సీ.. ఆ ఒక్కడితో కూడా చేస్తానంటోందట...

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాగ చైతన్య - సమంతల ప్రేమాయణం హాట్ టాపిక్‌గా ఉంది. ...

news

షూటింగ్ అపుడే అయిపోయిందా! అని బాధపడ్డా : నాగార్జున

అక్కినేని నాగార్జున నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం షూటింగ్‌ కీలక షెడ్యూల్‌ ...

Widgets Magazine