శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (17:17 IST)

మగధీర, బాహుబలి చూశా.. తెలుగు సినిమాల్లో నటించేందుకు రెడీ: విద్యాబాలన్

బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ తెలుగులో నటించేందుకు సై అంటోంది. డర్టీ పిక్చర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే తమిళ బక్క హీరో ధనుష్ సరసన పొలిటికల్ థ్రిల్లర్‌లో నటించేందుకు విద్యాబాలన్ ఓకే చెప్పేసిందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల్లో నటించేందుకు రెడీ అని చెప్పింది. 
 
ఎప్పుడో చిన్నప్పుడు మామయ్యతో కలిసి హైదరాబాద్ వెళ్లానని, గోల్కొండను చూశానని తెలిపింది. ప్రస్తుతానికి తెలుగు, మలయాళ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నానని.. స్కిప్ట్ కుదిరితే నటించేందుకు ఒప్పేసుకుంటానని చెప్పింది. ఇప్పటికే మగధీర, బాహుబలి వంటి సినిమాలు చూశానని.. బాహుబలి 2 కోసం వేచి చూస్తున్నట్లు విద్యాబాలన్ వెల్లడించింది.