బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (13:08 IST)

మా టీవీ అవార్డుల ఫంక్షన్‌లో డ్యాన్స్ చేయడానికి వ్యాపార బంధం ఓ కారణం : చిరంజీవి

సాధారణంగా స్టార్ హీరోలు అవార్డుల ఫంక్షన్లలో డ్యాన్సులు వేయరు. కుర్ర హీరోలు, హీరోయిన్లు స్టేజీపై డ్యాన్సులు వేస్తుంటే వాటిని చూస్తూ, వారిని ఎంకరేజ్ చేస్తూ ఆనందిస్తుంటారు.

సాధారణంగా స్టార్ హీరోలు అవార్డుల ఫంక్షన్లలో డ్యాన్సులు వేయరు. కుర్ర హీరోలు, హీరోయిన్లు స్టేజీపై డ్యాన్సులు వేస్తుంటే వాటిని చూస్తూ, వారిని ఎంకరేజ్ చేస్తూ ఆనందిస్తుంటారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం మాటీవీ అవార్డుల కార్యక్రమంలో అదిరిపోయే స్టెప్పులు వేసి ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఆ తర్వాత దీనికి గల కారణాలను ఆయన వివరించారు.
 
 
ఆదివారం రాత్రి ప్రసారమైన ఈ షోలో చిరంజీవి మాట్లాడుతూ తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం 150వ ఫిల్మ్. ఈ చిత్రం కథా చర్చలు, ఇతర పనుల్లో బిజీగా ఉన్నపుడు మాటీవీ వారు వచ్చి సంప్రదించారు. ఇలా ఓ అవార్డుల కార్యక్రమంలో కనిపించడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకున్నా, అందుకే వద్దన్నా. కానీ మా టీవీతో నాకు మొదటి నుంచి ఆత్మీయ అనుబంధం ఉంది. పైగా వారితో నాకు వ్యాపార బంధం కూడా ఉండనే ఉంది. ఇక అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ల అభ్యర్థనను ఒప్పుకోవాల్సి వచ్చింది. 
 
ఇక రెండో కారణం... నా సినీ రీఎంట్రీకి ఇది ఓ టెస్టులాగా కూడా ఉంటుందని భావించి అంగీకరించా. ఇక ఒకే చెప్పేయడంతో, ఆ ప్రోగ్రాం కోసం ఆరు గెటప్పులు.. 5 పాత్రలు వేశా. ఒకే రోజు వీటన్నింటి షూటింగ్ పూర్తి చేసేశారు. రిహార్సల్ చూసుకుని గ్యాంగ్ లీడర్ పాటకు స్టెప్పులేశా అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. నాతోపాటు శ్రీకాంత్, సునీల్, నవదీప్, సాయిధరమ్ తేజ్ వీళ్లందరూ కూడా డ్యాన్స్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆ పాటకు డ్యాన్స్ చేస్తుంటే నా ఒంట్లో తెలియని ఉత్సాహం నిండిపోయిందని చిరంజీవి అన్నారు.