Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆయన సరసన ఉంటే నాకేం? వాళ్లంటేనే భయం అంటున్న రెజీనా

హైదరాబాద్, ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (07:44 IST)

Widgets Magazine
Regina

తెలుగు చిత్రసీమలోకి బుల్లెట్‌లా దూసుకొచ్చి తనదైన ముద్ర వేసిన యంగ్ హీరోయిన్ రెజీనా ఉన్నట్లుండి జాక్ పాట్ కొట్టేసింది. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. చాన్స్ వచ్చింది కాదు ఇప్పుడు కొత్త ప్లేస్‌లో నటించడం ఎలా అనే భయం పుట్టుకుందామెకు. ఆ భయం అమితాబ్‌ వల్ల కాదంట, ప్రేక్షకులు, మీడియా అంటేనే భయం అని చెబుతోంది.
 
‘ఎ’ ఫర్‌ అమితాబ్‌ బచ్చన్‌. బాలీవుడ్‌లో అంతే మరి! యాక్టింగ్‌లో ఆయన తర్వాతే ఎవరైనా. అమితాబ్‌ తర్వాత ‘ఎ’ ఫర్‌... అనిల్‌కపూర్, అర్షద్‌ వార్సి, అర్జున్‌ రాంపాల్‌ పేర్లు రాసుకోవచ్చు. వీళ్లందరూ కూడా నటనలో తక్కువేం కాదు. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఆంఖే–2’లో రెజీనా ఈ బాలీవుడ్‌ మహామహులతో నటించనున్నారు.
 
హిందీ తెరకు పరిచయమవుతున్న తొలి సినిమాలో అమితాబ్‌ వంటి స్టార్‌తో పాటు హేమాహేమీలతో కలసి నటించడానికి నెర్వస్‌గా ఫీలవుతున్నారా అని రెజీనాని అడిగితే... ‘‘అమితాబ్‌ అయినా మరొకరైనా... నేను నెర్వస్‌గా ఫీలవను. నా భయమంతా ప్రేక్షకులతోనే. హిందీలో నా మొదటి సినిమా కదా! ప్రేక్షకులతో పాటు అక్కడి మీడియా ఎలా రిసీవ్‌ చేసుకుంటుందోనని భయపడుతున్నా. అందుకే కొంచెం నెర్వస్‌గా ఫీలవుతున్నా’’ అన్నారు. తెలుగులో కృష్ణవంశీ ‘నక్షత్రం’లో రెజీనా నటిస్తున్నారు. 
 
తానెంత ప్రయత్నించినా కుర్ర హీరోలే దొరుకుతున్నారు తప్పితే టాలివుడ్‌లో అగ్రహీరోలు తనపై కన్నెత్తి చూడరే అని వాపోతున్న రెజీనా ఏకంగా బాలివుడ్‌లో అమితాబ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేయడం విశేషమే కదా..
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాటమ రాయుడు వచ్చినాడు.. సీమ సందుల్లో తిరిగాడు.. పోస్టర్‌లో మెరిసినాడు.

రాయుడూ... వచ్చేశాడు. కాటమరాయుడు వచ్చేశాడు.. పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తొలి ...

news

తమన్నా పుకార్లకు దూరమా...?!

హీరోయిన్లు అన్నాక రూమర్లు మామూలే. కానీ తమన్నా విషయంలో కొంత మినహాయింపు వున్నట్లు ...

news

'గౌతమ్‌ నంద'గా గోపీచంద్‌...

గోపీచంద్‌ను 'గౌతమ్‌ నంద'గా దర్శకుడు సంపత్‌ నంది చూపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ...

news

అప్పట్లో తప్పుచేసిందట.... ఇప్పుడు కుర్రహీరోలకు రూ.1.5 కోట్లు, చిరంజీవికైతే రూ.1.75 కోట్లట... కాజల్ కహానీ

మగధీర చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అందాల భామ కాజల్ అగర్వాల్. తాజాగా మగధీర రామ్ ...

Widgets Magazine