Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్‌కు అందమైన భార్య... చక్కని కుమార్తె ఉంది.. ప్లీజ్ అర్థం చేసుకోండి : రేణూ దేశాయి

శనివారం, 1 జులై 2017 (06:37 IST)

Widgets Magazine
renu desai

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ మరోమారు స్పందించారు. పవన్‌తో కలిసి జీవించాలని ఫ్యాన్స్ పదేపదే కోరుతుండటంపై ఆమె ఫేస్‌బుక్ వేదికగా ఓ విన్నపం చేశారు. 
 
"నా వ్యక్తిగత జీవితం గురించి అందరికీ ఓ విజ్ఞప్తి చెయ్యాలనుకుంటున్నా. కల్యాణ్‌గారు నాలుగేళ్ల క్రితం అన్నా లెజ్‌నెవాను వివాహం చేసుకున్నారు. వారికి చక్కని కూతురు కూడా ఉంది. ఆయన వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. 
 
నేను కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరవద్దు. పవన్‌కల్యాణ్‌గారి భార్య అన్నా లెజ్‌నెవా.. నేను కాదు. ఆయన నా బిడ్డలకు తండ్రి మాత్రమే. మేమిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులం. అభిమానులు దయచేసి అర్థం చేసుకోండి. మేమిద్దరం ఎప్పటికీ తిరిగి భార్యభర్తలు కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. తిరిగి కల్యాణ్‌గారి దగ్గరికి వెళ్లమని మాటిమాటికీ కోరడం సబబుకాదు. 
 
మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు వెళ్లడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని అందరికీ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులూ కలిగించే, ఒత్తిడితో కూడిన కోరికలేమీ మీ దగ్గర నుంచి ఎదురుకావని ఆశిస్తున్నా. ఎంతో నిజాయితీతో మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను" అని రేణూ దేశాయ్ ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుష్క ఎక్కడ ఇబ్బంది పడుతోందో అక్కడే మేలుకున్నా.. కీర్తి సంబరం

అప్పటికీ, ఇప్పటికీ, ఇప్పటికీ దక్షిణాది ఎవర్ గ్రీన్ హీరోయిన్ సావిత్రి పాత్రను పోషించే ...

news

లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా... విషయాన్ని చూసి సెన్సార్ అదిరిపోయింది... ఆపలేకపోయింది...

ఈమధ్య కాలంలో ఎందుకో కొందరు నిర్మాతలు పూర్తిగా బూతు సినిమాల మీద దృష్టి సారించేశారు. తెలుగు ...

news

సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' ఫట్... కానీ రికార్డు సృష్టించింది... ఎట్లాగబ్బా?

బాలీవుడ్ తమాషా మూవీగా సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ గురించి చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం ...

news

నయనతారతో పెళ్లా? మలయాళ బ్యూటీ లవ్వాయణంపై పెదవి విప్పిన విఘ్నేష్‌!

నయనతార.. ఎప్పుడూ ఏదో ఒక‌ లవ్‌ఎఫైర్‌తో లైమ్ లైట్‌లో ఉంటోంది. మొదట్లో తమిళ హీరో శింబు, ఆ ...

Widgets Magazine