బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (09:26 IST)

సినిమాలు తీస్తానని నమ్మించి.. బ్లాక్ మెయిల్.. సినీ డైరెక్టర్‌పై అత్యాచార కేసు

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. తాను తీసే సినిమాలకు డబ్బులు పెట్టుబడి పెడతానని చెప్పిన మహిళనే బ్లాక్ మెయిల్ చేసినందుకు ఈ రేప్ కేసును నమోదు చేశారు. ఈ వివరాలను పర

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యువ దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. తాను తీసే సినిమాలకు డబ్బులు పెట్టుబడి పెడతానని చెప్పిన మహిళనే బ్లాక్ మెయిల్ చేసినందుకు ఈ రేప్ కేసును నమోదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్, మధురానగర్‌లో నివసిస్తున్న కార్తికేయ అనే వ్యక్తి దర్శకుడిగా స్థిరపడేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బోడుప్పల్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఓ యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. 
 
సినిమాలకు దర్శకత్వం వహిస్తానని చెప్పడంతో ఆమె డబ్బు పెట్టుబడి పెడతానని అతడికి చెప్పింది. ఇద్దరి మధ్య ఉన్న పరిచయంతో ఒకరోజు ఆమె ఫొటోలు, వీడియోలను కార్తికేయ చిత్రీకరించాడు. వాటిని అడ్డంపెట్టుకుని అతడు ఆమెను లొంగదీసుకున్నాడు. కార్తీకేయ బెదిరింపులు మితిమీరడంతో మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.