శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (14:00 IST)

అంతర్జాతీయ చిత్రోత్సవాలకు 'బాహుబలి'... తోలిరోజు షోకు జక్కన్న రెడీ...

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి''. అంతర్జాతీయ స్థాయిలో పలు రికార్డులను సొంతం చేసుకున్న 'బాహుబలి' తాజాగా మరో రికార్డును సృష్టించనుంది. ఈ చిత్రం 20వ అంతర్జాతీయ బసన్ ఫిలిమ్ ఫెస్టివెల్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 
 
సౌత్ కొరియాలో అక్టోబర్ ఒకటో తేది నుంచి పదో తేది వరకు అంతర్జాతీయ బసన్ ఫిలిమ్ ఫెస్టివెల్‌‌ నిర్వహించనున్నారు. ఇందులో అక్టోబర్ 4, 7, 9, 10 తేదిలలో బాహుబలిని ప్రదర్శిస్తున్నారు. 4వ తేది 'బాహుబలి' షోకు పాల్గొంటానని రాజమౌళి తెలిపారు.