అక్కినేని చైతన్యను అందుకే సమంత పెళ్లి చేసుకుందా?

గురువారం, 21 డిశెంబరు 2017 (14:33 IST)

అక్కినేని చైతన్య, హీరోయిన్ సమంతల వివాహం ఇటీవలే జరిగింది. స్టార్ డమ్ హీరోయిన్‌గా ఉన్న సమంత... అక్కినేని వారసుడు చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిజంగా చైను సమంత ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకుందో ఇపుడు తెలిసింది.
sam - chai
 
'మ‌నం' చిత్ర ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం "హ‌లో". అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బుధవారం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌కు హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో నాగార్జున తన ప్రసంగంలో తన ఇద్దరి కుమారుల గుణగణాల గురించి ప్ర‌స్తావించారు. తొలుత చైతూ గురించి మాట్లాడుతూ.. 'చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు' అని వ్యాఖ్యానించారు. 
 
దీంతో అభిమానులు ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లేలా కేకలు వేశారు. ఆ టైంలో సమంత కళ్లు చెమర్చాయి. ఈ మంచి మనసును చైతన్యలో చూడటం వల్లే సమంత పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ కార్య‌క్ర‌మానికి స‌మంత ఫుల్‌లెన్త్ లెహంగా ధ‌రించి హాజ‌రు కాగా, అక్కినేని వారి కొత్త కోడ‌లిని చూసి అభిమానులు మురిసిపోయారు. సమంత ప్ర‌స్తుతం 'మ‌హాన‌టి' చిత్రంతో పాటు "రంగ‌స్థ‌లం" చిత్రాలు చేస్తుంది. త‌మిళంలోనూ కొన్ని ప్రాజెక్టులు చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాజల్ అగర్వాల్‌కు బాగానే పెరిగిపోతున్నాయి...

కాజల్ అగర్వాల్‌కు బాగానే పెరిగిపోతున్నాయి...

news

నాకు అన్ని అలవాట్లున్నాయ్, ఎవరికి లేవు.. క్రిష్ణ భగవాన్ వ్యాఖ్యలు

నా అసలు పేరు పాపారావు చౌదరి. అందరికీ క్రిష్ణభగవాన్ గానే పరిచయం. నాకు అన్ని ...

news

'హలో' చూశా... అఖిల్ వాళ్ల బంగారం... చిరంజీవి

అక్కినేని అఖిల్ హలో చిత్రం రేపు డిశెంబరు 22న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిన్న ...

news

16 కిలోల బరువు తగ్గిన బాలీవుడ్ హీరోయిన్ (వీడియో)

చాలా మంది హీరోయిన్లు తమకు వచ్చే సినీ ఛాన్సుల్లోని పాత్రలకు అనుగుణంగా తమ శరీరాకృతిని కూడా ...