శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శనివారం, 28 మే 2016 (10:06 IST)

'రైట్ రైట్'కు సెన్సార్ క్లీన్ 'యు' సర్టిఫికెట్: జూన్ 10న విడుదల

క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన తాజా చిత్రం `రైట్ రైట్‌`. ఈ సినిమాను వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు సమర్పణలో మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించారు. సుమంత్ అశ్విన్ స‌ర‌స‌న‌ పూజా జవేరి నాయిక‌గా న‌టించారు. బాహుబ‌లి ఫేమ్ ప్ర‌భాక‌ర్ కీల‌క పాత్ర  పోషించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ 'క్లీన్ యు' సర్టిఫికెట్ ఇచ్చింది. జూన్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత జె. వంశీకృష్ణ మాట్లాడుతూ - "ఓ బస్సు నేపథ్యంలో సాగే చిత్రం ఇది. అనుకోకుండా బస్ కండక్టర్ అయిన ఓ కుర్రాడికి ఓ మిస్ తారసపడుతుంది. ఆ మిస్సుతో బస్ కండక్టర్ కి ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? అనేది కథ. కామెడీ, ల‌వ్‌, మిస్ట‌రీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. చాలా న్యాచురల్ మూవీ. సుమంత్ అశ్విన్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది. తన కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రింట్లతో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటివరకూ సుమంత్ అశ్విన్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఈ చిత్రంలో చేశారు. 'బాహుబలి' ఫేమ్ ప్రభాకర్ చేసిన పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. అన్ని వర్గాలవారూ చూడదగ్గ మంచి చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
 
నాజ‌ర్‌, ధ‌న‌రాజ్‌, `ష‌క‌ల‌క` శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, జీవా, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌త్‌రెడ్డి, వినోద్‌, పావ‌ని, క‌రుణ‌, జ‌య‌వాణి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం:  జె.బి., పాట‌లు:  శ్రీమ‌ణి, కెమెరా:  శేఖ‌ర్ వి.జోస‌ఫ్‌, మాట‌లు:  `డార్లింగ్‌` స్వామి, ఆర్ట్ :  కె.ఎమ్‌.రాజీవ్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  జె.శ్రీనివాస‌రాజు, నిర్మాత‌:  జె.వంశీకృష్ణ‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌ను, స‌మ‌ర్ప‌ణ‌: వ‌త్స‌వాయి వెంక‌టేశ్వ‌ర్లు.