శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (12:41 IST)

రుద్రమదేవి రివ్యూ రిపోర్ట్ : మగాడి ముసుగులో వీరనారిగా అనుష్క ఎలా? అల్లు అర్జున్ అదుర్స్!

రుద్రమదేవి నటీనటులు: అనుష్క, దగ్గుబాటి రానా, అల్లు అర్జున్, సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్య మీనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, అజయ్‌ తదితరులు; సంగీతం: ఇళయరాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సమర్పణ: రాగిణీగుణ. నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: గుణశేఖర్. 
విడుదల తేదీ: అక్టోబర్ 9, 2015
 
రుద్రమదేవి కథ అందరికీ తెలిసిందే. కాకతీయ రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది. అయితే స్క్రీన్ ప్లే మాత్రం మందగించిందని టాక్ వస్తోంది. విజువల్స్ స్టన్నింగ్‌గా ఉండేలా గుణశేఖర్ ప్లాన్ చేసుకోలేదని సమాచారం. ముఖ్యంగా బాహుబలి యాక్షన్ ఎపిసోడ్స్ అదరగొట్టినట్లుగా రుద్రమదేవిలో గుణశేఖర్ కవర్ చేయలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో రుద్రమదేవి చరిత్రను కొద్దిగా పరిచయం చేస్తూ కథ మొదలవుతుంది. 
 
 
ఇంటర్వెల్ వచ్చేసరికి గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్ కొన్ని లెంగ్తీ ఎమోషన్ సీన్స్‌తో.. సీక్వీల్ తీస్తామని చెప్తూ ముగిసేలా ప్లాన్ చేసారు. అంతవరకూ డిజైనింగ్ పరంగా వినటానికి బాగానే ఉంది. వాస్తవంగా జరిగిన కథకు సమకూర్చిన స్క్రీన్ ప్లే చాలా సినిమాటిక్‌గా సాగుతుంది. పాత్రల్లో ఎక్కడా బలం ఉండదు. కీలక పాత్రల క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ రుద్రమదేవికి మైనస్ అయ్యాయనే చెప్పాలి. 
 
కథలోకి వెళితే..
రుద్రమదేవి(అనుష్క) జన్మించేసరికి కాకతీయ సామ్రాజ్య పరిస్థితులు అంతగా బాగోలేవు. ఓవైపు దాయాదులు, మరోవైపు శత్రువుల నుంచి ఆ సామ్రాజ్యానికి ముప్పు పొంచి వున్నది. తన వంశంలో మగపిల్లాడు పుడితే తమ వారసుడిగా రాజ్యపరిపాలన చేస్తాడని గణపతి దేవుడు (కృష్ణంరాజు) అనుకుంటాడు. కానీ తనకు ఆడపిల్ల పుట్టడంతో నిరాశపడతాడు. 
 
వారసుడు లేడు అని తెలిస్తే వెంటనే శత్రువులు, దాయాదులు దండెత్తే అవకాశం ఉందని ఏం చేయాలో అని ఆలోచనలో పడితే అప్పుడు ఆయన మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) ఓ సలహా ఇస్తాడు. బయిట ప్రపంచానికి తెలియకుండా ఆమెను మగపిల్లాడిలా నమ్మిస్తూ పెంచమంటాడు. ఆ క్రమంలో రుద్రమదేవి కుమారుడిలా పెరుగుతుంది. 
 
 
ఆమె పెరిగి పెద్దయ్యాక వివాహం సైతం ముక్తాంబ(నిత్యామీనన్ )ని ఇచ్చి చేస్తారు. ఇదే సమయంలో బందిపోటు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రుద్రమదేవితో పోరుకు సై అంటాడు. అప్పుడు ఏం జరిగింది. రుద్రమదేవి. మగపిల్లాడు కాదు. స్త్రీ అనే విషయం ఎలా తెలియవచ్చింది. ఆమెను ప్రేమించిన వీరభధ్రుడు (దగ్గుబాటి రానా) ఏం చేసి ఆమెను పొందాడు.రుద్రమదేవి తన ముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొని వీర నారి ఎలా అయ్యిందని తెలుసుకోవాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందే.

రేటింగ్: 3/5