గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఆగస్టు 2016 (18:09 IST)

ఆస్కార్ "బెస్ట్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌" కేటగిరీకి ''రుద్రమదేవి'': గుణశేఖర్ ట్వీట్!

అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ''రుద్రమదేవి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. కాకతీయుల కాలం నాటి విరోచిత గాథను తెరపై దర్శకుడు గుణశేఖర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం

అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ''రుద్రమదేవి'' సినిమా హిట్టైన సంగతి తెలిసిందే. కాకతీయుల కాలం నాటి విరోచిత గాథను తెరపై దర్శకుడు గుణశేఖర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 
 
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రేసుకు సిఫార్సైంది. ''రుద్రమదేవి'' సినిమాను "బెస్ట్‌ ఫారెన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌" కేటగిరీలో ఆస్కార్‌ అవార్డుల ఎంపిక కమిటీకి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపింది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ధన్యవాదాలు తెలియజేశారు.
 
ఇకపోతే.. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9, 2015న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదలైంది. కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా.. తాజాగా ఆస్కార్ అవార్డుల కోసం ఎంపిక కావడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది.